నిమ్మగడ్డను అలా ఇరికిస్తారా.. ?
ఏపీలో చూస్తూంటే పంచాయతీ ఎన్నికలు పేరుకు మాత్రమే జరుగుతున్నాయి. కానీ అసలు పంచాయతీ తెర వెనక మస్తుగా సాగుతోంది. రాజకీయ పార్టీలు వాటి ఆధిపత్యాలు, వ్యూహాలు ప్రతి [more]
ఏపీలో చూస్తూంటే పంచాయతీ ఎన్నికలు పేరుకు మాత్రమే జరుగుతున్నాయి. కానీ అసలు పంచాయతీ తెర వెనక మస్తుగా సాగుతోంది. రాజకీయ పార్టీలు వాటి ఆధిపత్యాలు, వ్యూహాలు ప్రతి [more]
ఏపీలో చూస్తూంటే పంచాయతీ ఎన్నికలు పేరుకు మాత్రమే జరుగుతున్నాయి. కానీ అసలు పంచాయతీ తెర వెనక మస్తుగా సాగుతోంది. రాజకీయ పార్టీలు వాటి ఆధిపత్యాలు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ చూస్తూంటే పంచాయతీ ఎన్నికలు ఈ తీరున ఎపుడైనా జరిగాయా అనిపించకమానదు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానానికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టి మరీ పంచాయతీ ఎన్నికలను జరిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలసి సహకరించుకోవాల్సిన చోట కలహాల కాపురం సాగుతున్నా సై అంటూ ఎన్నికలకు తెర లేపారు. మరి దీని ఫలితాలు, పర్యవసానలు ఎలా ఉన్నా కూడా ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు సాగుతున్నారు.
గుస్సా అవుతున్న వైసీపీ…
ఇక సుప్రీం కోర్టు పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపీనా తరువాత కూడా వైసీపీ నేతలు ఏ మాత్రం తగ్గడంలేదు. తమ కోపాన్ని అంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మాటల ద్వారా చూపిస్తున్నారు. ఆ విషయంలో అందరి కంటే ముందే ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే నిమ్మగడ్డ వైఖరి మీద తెగ మండుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుని గౌరవించి ఎన్నికలకు సిద్ధపడ్డామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తమకు ఎన్నికలు అంటే అసలు భయం లేదని, ప్రజారోగ్యమే ముఖ్యమనుకుని కరోనా వేళ వద్దు అని భావించామని ఆయన చెప్పారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలతో ఇపుడు ఏపీలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆయన అంటున్నారు. 2018లోనే హైకోర్టు ఎన్నికలు పెట్టాలని తాము కోరితే నాడు నిమ్మగడ్డ ఏం చేశారని కూడా ఆయన నిలదీశారు. నిమ్మగడ్డ నాడు ఎన్నికల అవసరం గురించి చంద్రబాబుతో ఎందుకు చెప్పలేదు అని కూడా నిలదీస్తున్నరు.
తేడా వస్తేనా…?
ఇదిలా ఉంటే ఏపీలో ప్రజారోగ్యంతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యపరంగా కానీ కరోనా పరంగా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా బాధ్యత వహించాలని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పటికీ కరోనా కేసులు వస్తున్నాయని అయినా మొండిగా ఎన్నికలకు నిమ్మగడ్డ తెర తీశారని ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో జరగబోయే పరిణామాలకు కూడా ఆయనే బాధ్యుడు అవుతాడు అని విజయసాయిరెడ్డి స్పష్టం చెస్తున్నారు.
కార్నర్ అవుతారా…?
ఇక దేశంలో కూడా ఇపుడు మళ్ళీ కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ ఉందని కూడా వైద్య రంగ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో రెండు నెలల పాటు వరస ఎన్నికలు అంటే ఏపీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నది వైద్య రంగ నిపుణులు నుంచి కూడా వస్తున్న ప్రశ్న. ఇక పూర్తిగా బ్యాలెట్ పేపర్ మీద జరిగే ఎన్నికల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వ్యాప్తి పెరిగినా ఆశ్చర్యం లేదన్న మాట ఉంది. ఒకవేళ అలాంటి విపరిణామాలు కనుక జరిగితే దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను బాధ్యుడిగా చేయడానికి వైసీపీ రెడీగా ఉంది.
మొత్తానికి వైసీపీ నేతలు నిమ్మగడ్డ మీద అతి పెద్ద బాధ్యతనే పెట్టేశారనుకోవాలి.