నిమ్మగడ్డకే అంత పంతం ఉంటే?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ఆయన మీడియా సమావేశాల్లోనూ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఆయన పదవికాలం ఇంకా రెండు [more]

Update: 2021-02-04 06:30 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ఆయన మీడియా సమావేశాల్లోనూ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఆయన పదవికాలం ఇంకా రెండు నెలలే. ఈ రెండు నెలల్లో తాను ఏంటో నిరూపించుకోవాలన్న తాపత్రయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నట్లు కనపడుతుంది. ఆయన ఇటు అధికారులకు, అటు ప్రభుత్వానికి పరోక్షంగా వార్నింగ్ లు ఇస్తుండటం విశేషం.

అధికారులని కూడా….

పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లను నిర్భంధ పదవీ విరమణ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీవోపీటీకి లేఖ రాశారు. ఈ లేఖ అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డకు అధికారుల పనితీరు గురించి తెలియదా? వారు ఎవరికి లోబడి పనిచేస్తారో ఆయన అనుభవంలో గుర్తుకు రాలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావాలనే ఆ ఇద్దరు అధికారులపై నిర్భంధ పదవీ విరమణ సిఫార్సు చేసి ఆ తర్వాత విమర్శలతో వెనక్కు తగ్గారు.

ప్రభుత్వంపై సెటైర్లు….

ఇక ప్రభుత్వంపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విమర్శలను ఆపడం లేదు. ఈ యాప్ పై ప్రభుత్వం న్యాయస్థానానికి వెళ్లకుంటే ఆశ్చర్యపడేవాడినని సెటైర్ వేశారు. అంతేకాదు ఏకగ్రీవాలు బాగా తగ్గాయని చెప్పి తాను ఎన్నికల్లో అనుకున్నది సాధించినట్లు ఫీలయ్యారు. ఇక టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడితే స్వయంగా అక్కడకు వెళ్లి పరామర్శించడం కూడా చర్చనీయాంశంమైంది. టీడీపీ ప్రతినిధిగా, లోకేష్ కు పైలట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడకు వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రానున్న కాలంలో….

ఇక రానున్న కాలంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరికొన్ని చర్యలకు కూడా దిగే అవకాశముంది. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ముందు ముందు నిమ్మగడ్డ అనేక ఆదేశాలు జారీ చేస్తారు. ఇక ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోయే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అంత పట్టుదల ఉంటే మరో మూడేళ్లు అధికారంలో ఉండే తమకు ఎంత ఉండాలని ప్రభుత్వం పంతానికి పోతుంది. మరో రెండు నెలలు ఏపీలో ఈ సీన్ కంటిన్యూ అవుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News