నిమ్మగడ్డ మేలే చేశారా…?
ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాను అంటూ పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన కరోనా టైంలో [more]
ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాను అంటూ పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన కరోనా టైంలో [more]
ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాను అంటూ పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన కరోనా టైంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలు ఒక్కసారిగా నాడు వాయిదా వేశారని ముఖ్యమంత్రి జగన్ అహం దెబ్బతింది. దాంతో ఏడాది పాటు సాగిన కధ అంతా ఇగోల మీదనే ఫోకస్ అయిందని అందరికీ తెలుసు. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో ఇష్టం లేకపోయినా జగన్ ఎన్నికలకు ఓకే చెప్పారు. తొలి విడత పంచాయతీ ఫలితాల తరువాత జగన్ లో కూడా మార్పు వచ్చింది అంటున్నారు.
టోటల్ గా ఓకే…..
ఇక అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ప్రభుత్వంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఇలా రెండు వైపులా సామరస్య వాతావరణం ఉండడంతో జగన్ మాట తప్పేశారు అంటున్నారు. నిమ్మగడ్డ ఉండగా స్థానిక ఎన్నికలను జరిపించను అంటూ ఒట్టేసుకుని కూర్చున్న జగన్ ఇపుడు అన్ని ఎన్నికలనూ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ లిఖితపూర్వకమైన అంగీకారం కూడా తెలిపారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఇరవై నెలల జగన్ పాలన మీద జనానికి మోజు బాగానే ఉందని, పెద్దగా వ్యతిరేకత రాలేదని ఫలితాల సరళిని బట్టి వైసీపీ పెద్దలకు అర్ధమైందట. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నా మరొకరు ఉన్నా కూడా తప్పని ఎన్నికలకు ఇపుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే పోలా అని ఓకే అనేశారట.
కరెక్ట్ టైం లో ….
నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎన్నికలు నిర్వహించాలని పంతం ఉండడం చివరికి వైసీపీకే కలసి వచ్చిందని అంటున్నారు. ఇపుడు చూస్తే ఇంకా శీతాకాలం ఉంది. రాష్ట్రంలో సమస్యలు కూడా పెద్దగా లేవు. కరోనా తగ్గింది. జనాలు కూడా ఇప్పటికైతే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఈ టైంలో ఎన్నికలు పెట్టడం వల్ల ప్రభుత్వానికే సానుకూలంగా ఓటింగ్ జరుగుతుంది అంటున్నారు. అదే జగన్ అనుకున్నట్లుగా ఏ వేసవి లోనో లేక ఈ ఏడాది చివరలోనే ఎన్నికలు పెట్టి ఉంటే కచ్చితంగా అవి వైసీపీకి రివర్స్ అయి ఉండేవని విశ్లేషణలు ఉన్నాయి. వేసవిలో కరెంట్ కోతలతో పాటు నీటి కష్టాలు ఇతర సమస్యలు కూడా పెరిగి సర్కార్ కే పెద్ద దెబ్బ పడేది అంటున్నారు.
ఇక అభివృద్ధి మీదే….?
స్థానిక ఎన్నికల సమయంలోనే తిరుపతి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ మొత్తం టైంలో ఎన్నికల వేళ నిబంధనల రూపంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. దాంతో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగేందుకు వీలు లేదు. ఇపుడూ ఎటూ ఎన్నికల మీద ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిపించేస్తే ఒక్క దెబ్బకు అన్నీ పూర్తి అవుతాయి. దాంతో రానున్న మూడేళ్ళ కాలంలో డేరింగ్ గా నిర్ణయాలు తీసుకోవచ్చునని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోందిట. మరో వైపు పార్టీలోని క్యాడర్ కూడా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పదవులతో కుదురుకుంటారని, మరింతగా గ్రాస్ రూట్ లెవెల్ లో కూడా వైసీపీ పటిష్టం అవుతుంది అని కూడా అంచనాలు వేసుకుంటున్నారుట. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడే ఇపుడు వైసీపీకి కోరకుండానే వరం అయిందని పార్టీ నేతలు లోలోపల సంతోషిస్తున్నారుట.