దమ్మున్న నేత దౌడు తీస్తాడా?

ఆయన ఏడు నెలల కాలంలో దమ్మున్న నాయకుడిగా పేరుపొందారు. టీడీపీని, చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటారని ఆయనను చూసిన వారు ఎవరైనా నమ్మక తప్పదు. ఆయనే పాలకొల్లు [more]

Update: 2020-02-06 11:00 GMT

ఆయన ఏడు నెలల కాలంలో దమ్మున్న నాయకుడిగా పేరుపొందారు. టీడీపీని, చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటారని ఆయనను చూసిన వారు ఎవరైనా నమ్మక తప్పదు. ఆయనే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పార్టీలో నిమ్మల రామానాయుడు చేసే హడావిడి డౌట్ కొడుతుందంట. పార్టీ కార్యక్రమాలను ఎంత స్పీడ్ గా చేస్తున్నారో, అంతే స్పీడ్ గా ఆయన జంప్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎవరికీ డౌట్ రాదు….

అయితే నిమ్మల రామానాయుడు పరిస్థితిని చూస్తే ఎవరికీ అనుమానం రాదు. కానీ అంతర్గతంగా ఆయన వేస్తున్న అడుగులు పార్టీని వీడుతారన్న సంకేతాలు ఇస్తున్నాయి. పాలకొల్లులో సరైన వైసీపీ నాయకుడు లేకపోవడం కూడా నిమ్మల రామానాయుడు అటు వైపు చూస్తున్నారన్న వదంతులు బలంగా ఉన్నాయి. వైసీపీ నేత సరైనోడు లేకపోవడం తనకు కలసి వచ్చే అంశంగా రామానాయుడు భావిస్తున్నారట.

జగన్ గాలిలోనూ గెలిచి…..

నిజానికి పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఉండి, పాలకొల్లులో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. జగన్ గాలిలో సయితం రామానాయుడు గెలిచారు. శాసనసభ పక్ష ఉపనేత పదవి చంద్రబాబు ఇచ్చారు. అయితే గత ఏడు నెలలుగా అసెంబ్లీలో, నియోజకవర్గంలో టీడీపీ పక్షాన నిలిచి పోరాడుతున్నారు. కానీ గత కొద్దిరోజులుగా తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్నా అంతా వైసీపీీ కన్వీనర్ వద్దకే ప్రజలు వెళుతుండటంతో రామానాయుడు తట్టుకోలేకపోతున్నారు.

వెళ్లడానికి రెడీ అయ్యారా?

సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా నిమ్మల రామానాయుడు వైపు ప్రజలు కన్నెత్తి చూడటం లేదట. ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ పనుల కోసం కూడా నియోజకవర్గ కన్వీనర్ వద్దకే వెళుతున్నారు. అధికారులు కూడా నిమ్మలను పట్టించుకోవడం లేదట. వైసీపీలోకి వెళితే బాుగుంటుందని ఆయన ఆలోచనలో పడ్డారట. పాలకొల్లులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయిన బాబ్జీని తప్పించి కౌరు శ్రీనివాస్ కు ఇన్ ఛార్జి పదవి అప్పగించారు. దీంతో పాలకొల్లులో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అందరినీ సమన్వయం చేసుకుని నిమ్మల రామానాయుడు వెళ్లగలరని కొందరు వైసీపీనేతలే జగన్ దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. వైసీపీ కూడా నిమ్మల వస్తే రెడ్ కార్పెట్ వేయాలని చూస్తుంది. మరి నిమ్మల రామానాయుడు విశ్వాసపాత్రుడిగానే ఉండి టీడీపీలో కొనసాగుతారా? నాలుగేళ్లు వెయిట్ చేయలేక వైసీపీలోకి వెళతారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News