నిమ్మల‌కు జ‌గ‌న్ మార్క్ చెక్… ప్రత్యేక ఫార్ములాతో?

టీడీపీని బ‌ల‌హీన ప‌ర‌చాల‌నే నిర్ణయంతో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఈ క్రమంలో అనేక వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా మంది నాయ‌కులు [more]

Update: 2020-03-23 00:30 GMT

టీడీపీని బ‌ల‌హీన ప‌ర‌చాల‌నే నిర్ణయంతో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఈ క్రమంలో అనేక వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా మంది నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచ‌న చేరుతున్నారు. అయితే కొంద‌రు క‌రడుగ‌ట్టిన‌ టీడీపీ నాయ‌కులు మాత్రం పార్టీలోనే ఉన్నారు. ఇలాంటి వారిలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ గెలిచిన నిమ్మల రామానాయుడు ఒక‌రు. గ‌త ఎన్నిక‌ల్లో నిమ్మల రామానాయుడు ఇక్కడ నుంచి 18 వేల ఓట్లతో విజ‌యం సాధించారు. ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన బాబ్జీ ఓడిపోయారు.

కౌరు శ్రీనివాస్ కు బాధ్యతలు…

అయితే, సాధార‌ణంగా టీడీపీ త‌ర‌ఫున గెలిచిన నాయ‌కుల మాదిరిగా కాకుండా నిమ్మల రామానాయుడు దూకుడుగా వెళ్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నారు. అటు అసెంబ్లీలోను ఇటు బ‌య‌ట కూడా జ‌గ‌న్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయ‌న‌కు అసెంబ్లీలో టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత ప‌ద‌వి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో జ‌గ‌న్ ఒకింత మ‌ద‌న‌ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. నిమ్మల రామానాయుడుకు ఎలాగైనా చెక్ పెట్టాల‌ని నిర్ణయించారు. దీంతో ఇక్కడ వైసీపీ బాధ్యత‌ల‌ను శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన కౌరు కౌరు శ్రీనివాస‌రావుకు ప‌గ్గాలు అప్పగించారు.

అడుగడుగునా….

జిల్లాలో డెల్టా ప్రాంతంలో మెజార్టీ సీట్లు రాజులు, కాపుల‌కే ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఒక్క సీటు కూడా బీసీల‌కు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే డెల్టాలో బ‌లంగా ఉన్న శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన కౌరు శ్రీనివాస్‌ను పాల‌కొల్లులో పార్టీని ప‌టిష్టం చేయాల‌ని ఆదేశించారు. వైసీపీని పాల‌కొల్లులో బ‌లోపేతం చేయ‌డంతో పాటు నిమ్మల రామానాయుడుకు అడుగ‌డుగునా చెక్ పెట్టేలా కౌరు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇక‌ జ‌గ‌న్ కూడా ఇక్కడ నియ‌మించిన కౌరుకు ద‌న్నుగా ఆయ‌న‌కు ఎప్పటిక‌ప్పుడు ప్రమోష‌న్లు ఇస్తున్నారు. అంటే ఆయా ప్రమోష‌న్లతో మ‌రింత దూకుడుగా ప‌నిచేస్తార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

కులాల ప్రాతిపదికపై….

ఈ క్రమంలోనే కౌరుకు డీసీసీబీ చైర్మన్ ప‌ద‌విఇచ్చారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఆయ‌న‌కు జ‌డ్పీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే య‌ల‌మంచిలి జ‌డ్పీ చైర్మ్‌న్‌గా పోటీ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ విష‌య‌మే పాల‌కొల్లు స‌హా ప‌శ్చిమ గోదావ‌రి వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. కౌరు బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆ వ‌ర్గం అంతా కూడా నిమ్మల రామానాయుడు నుంచి దూర‌మై కౌరు ప‌క్షాన చేరుతుంద‌ని భావిస్తున్నారు. కౌరు శ్రీనివాస్ పాల‌కొల్లులో ఎంట్రీ ఇచ్చాక యువ‌త‌ను వైసీపీ వైపు ఆక‌ర్షితులు అయ్యేలా చేయ‌డంలో సక్సెస్ అయ్యారు.

కాపు + బీసీ ఫార్ములాతో…..

ఇక అదే నియోజ‌క‌వ‌ర్గంలో కాపు వ‌ర్గానికి చెందిన య‌డ్ల తాతాజీకి కూడా జ‌గ‌న్ కీల‌క ప‌ద‌విని అప్పగించారు. ఆయ‌న‌కు డీసీఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. దీంతో జిల్లాలో వైసీపీ నేత‌ల హుషారు పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే నిమ్మల రామానాయుడును ఢీ కొట్టేందుకు కీల‌క ప‌ద‌వులు అన్నీ జ‌గ‌న్ పాల‌కొల్లుకే ఇస్తుండ‌డంతో స్థానిక వైసీపీ కేడ‌ర్‌లో ఎక్కడా లేని జోష్ నెల‌కొంది. నిమ్మల రామానాయుడుకు చెక్ పెట్టే క్రమంలో కాపు+బీసీ ఫార్ములాను అమ‌లు చేస్తు న్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ ఫార్ములా ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News