దేశానికి అన్న ఎవరో తెలుసా… ?
ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రం చాలా మంది అన్నలను చూసింది. అందరికీ తెలిసిన అన్న గారు ఎన్టీఆర్ అయితే ఆ తరువాత చంద్రన్నగా చంద్రబాబు వచ్చారు. ఇక ప్రజారాజ్యం [more]
ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రం చాలా మంది అన్నలను చూసింది. అందరికీ తెలిసిన అన్న గారు ఎన్టీఆర్ అయితే ఆ తరువాత చంద్రన్నగా చంద్రబాబు వచ్చారు. ఇక ప్రజారాజ్యం [more]
ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రం చాలా మంది అన్నలను చూసింది. అందరికీ తెలిసిన అన్న గారు ఎన్టీఆర్ అయితే ఆ తరువాత చంద్రన్నగా చంద్రబాబు వచ్చారు. ఇక ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి అన్నయ్యగా మెగాస్టార్ జనం ముందుకు వచ్చారు. జగన్ అయితే మీ అన్నగా తోడుంటాను అంటూ పాదయత్ర వేళ గట్టి అభయమే ఇచ్చారు. ఇపుడు ఏపీలో జగనన్న రాజ్యమే సాగుతోంది. ఇక పవన్ అన్న, లోకేష్ అన్న కూడా ఉన్నారు. కానీ ఇక దేశం మొత్తానికి అన్నగా మోడీ సాబ్ దిగిపోతున్నారు.
ఆయనే అన్నట ..
ఏపీ మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అన్న దానికి నిదర్శనమే తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్రా పర్యటన. ఆమె తాజాగా మూడు రోజుల పాటు ఏపీలో టూర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విశాఖ జిల్లాలో ఒక రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ లబ్దిదారులతో ముచ్చటించారు. ఉచిత బియ్యం ఎవరు ఇస్తున్నారు అంటూ ఆమె వేసిన ప్రశ్నకు వారు సరిగ్గా బదులివ్వలేకపోయారు. కొందరు అయితే జగన్ అన్న అనేశారు కూడా. దాంతో ఖంగు తిన్న నిర్మలమ్మ అన్న అంటే జగన్ మాత్రమే కాదు, మోడీ కూడానూ అంటూ వారికి విడమరచి చెప్పాల్సి వచ్చింది. అంతే కాదు, దేశానికే మోడీ పెద్దన్న అంటూ ఆమె వారికి వివరించారు.
బొమ్మ ఉండాల్సిందే….?
ఇక కరోనా వేళ పేదలు పస్తు ఉండరాదు అంటూ కేంద్రం ఉచితంగా కొన్ని నెలల పాటు బియ్యం అందిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. అందువల్ల రేషన్ డీలర్లు ఈ విషయం లబ్దిదారులకు చెప్పాలని కోరారు. అదే విధంగా ప్రతీ డీలర్ షాప్ వద్ద మోడీ బొమ్మతో కూడిన బ్యానర్ కచ్చితంగా ఉండాల్సిందే అని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక జగన్ అన్న బియ్యం వాహనాల్లో వెళ్తే మోడీ ఇచ్చే బియ్యం రేషం దుకాణాలోనే ఇవ్వాలని కూడా సూచించారు. మొత్తానికి బియ్యం విషయంలో జగన్ అన్న, మోడీ అన్నా అంటూ నిర్మలమ్మ రాజకీయ లెక్కలు బాగానే చెప్పారు అంటున్నారు.
వదలకూడదట …
అదే విధంగా బీజేపీ కార్యకర్తలు నాయకుల సమావేశంలో కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విధంగానే సూచించారు. కేంద్రం ఏపీకి ఎంతో సాయం చేస్తోందని, దాన్ని జనంలోకి తీసుకుపోవాలని ఆమె కోరారు. అంటే ఒక వైపు తన సంక్షేమాన్ని కేంద్రం అడ్డుకుంటోంది అంటూ వైసీపీ మంత్రులు రాగాలాపన చేస్తున్న తరుణంలో తాము కూడా అదే రూట్లో రావాలని బీజేపీ ఏదో కొత్త ఆలోచన చేస్తోంది అంటున్నారు. ఇక ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటున్న కేంద్రం గురించి ఎవరు విమర్శలు చేసినా గట్టిగానే తిప్పికొట్టాలని కూడా నిర్మలా సీతారామన్ ఆదేశించడం విశేషం. మొత్తానికి ఏపీ విషయంలో ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగానే బీజేపీ తీరు ఉంది.