అదే జరిగితే నితీష్ కు కష్టమేనా?

ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమిగా పోటీ చేసినా ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ తన [more]

Update: 2020-11-07 16:30 GMT

ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమిగా పోటీ చేసినా ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశముంది. ఈ సంగతి నితీష్ కుమార్ కు తెలియంది కాదు. అందుకే తన పార్టీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తనకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటే ముఖ్మమంత్రి పదవి నుంచి నితీష్ కుమార్ ను పక్కన పెట్టే అవకాశముంది.

నమ్మకమైన మిత్రులుగానే….

బీహార్ లో నమ్మకమైన మిత్రులుగా బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేస్తున్నాయి. బీహార్ లో మొత్తం 243 స్థానాలుండగా బీజేపీ 121 స్థానాల్లోనూ, జేడీయూ 122 స్థానాలను పంచుకున్నాయి. ఎవరికి వారే తమ మిత్రులకు కొన్ని స్థానాలను కేటాయించాయి. జేడీయూ తన మిత్రపక్షమైన జితిన్ రామ్ మాంఝీ నాయకత్వంలోని హిందుస్థానీ ఆవామీ మోర్చా పార్టీకి 11 స్థానాలను కేటాయించింది. బీజేపీ వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీకి కొన్ని స్థానాలను కేటాయించింది.

సీఎం అభ్యర్థిగా ప్రకటించినా….

అయితే బీజేపీ ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించింది. కూటమి గెలిస్తే నితీష్ కుమార్ సీఎం అవుతారు. కానీ బీజేపీని నమ్మలేని పరిస్థితి. సుదీర్ఘకాలం మిత్రుడిగా ఉన్న శివసేననే బీజేపీ పక్కన పెట్టింది. వారికి నితీష్ కుమార్ ఒక లెక్క కాదు. దీంతో నితీష్ కుమార్ బీజేపీ కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని శ్రమిస్తున్నారు. ఇప్పటికే లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తుంది.

ఎక్కువ స్థానాలు వస్తేనే?

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో నితీష్ కుమార్ కు చెందిన జేడీయూకు ఏమాత్రం స్థానాలు దక్కినా ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ కొర్రీలు పెట్టే అవకాశముంది. ఇందుకు లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ను ఉపయోగించుకుంటారంటున్నారు. బీజేపీ వ్యూహాలను తెలుసుకున్న నితీష్ కుమార్ తన పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా శ్రమిస్తున్నారు. మొత్తం మీద నితీష్ కుమార్ కు బీజేపీ గండం పొంచి ఉన్నట్లే కన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News