నితీష్ కు కష్టకాలమేనా?
బీహార్ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న చర్చ బీహార్ లో జోరుగా [more]
బీహార్ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న చర్చ బీహార్ లో జోరుగా [more]
బీహార్ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న చర్చ బీహార్ లో జోరుగా సాగుతోంది. పోలింగ్ శాతం కూడా కొంత తగ్గడం అధికార పార్టీని కలవరపరుస్తుంది. 2005 నుంచి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నిజాయితీకి మారు పేరు కావడంతో ప్రజలు ఆయనకు పట్టం కడుతూ వస్తున్నారు.
పదిహేనేళ్లుగా….
అయితే 2015లో విజయం సాధించిన తర్వాత ఆయన బీజేపీ పంచన చేరడం నితీష్ కుమార్ కు ఇబ్బందిగా మారింది. బీజేపీ కూడా నితీష్ కుమార్ ను పావుగా వాడుకునేందుకే ఆయనకు ఇన్నాళ్లూ మద్దతిచ్చిందంటున్నారు. బీహార్ ఎన్నికల్లో సర్వే ఫలితాలన్నీ నితీష్ కుమార్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఫలితాలు వెలువడేంతవరకూ చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇటు నితీష్ కుమార్ పై వ్యతిరేకతతపోటా బీజేపీ తో చెలిమి ఆయనను దారుణంగా దెబ్బతీసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
విపక్ష కూటమి పుంజుకోవడంతో…..
బీహార్ లో తొలుత మహాకూటమి కొంత డల్ గా కన్పించినప్పటికీ తర్వాత పుంజుకుంది. తేజస్వి యాదవ్ ప్రజల్లో దూసుకుపోయి నితీష్ కుమార్ నే టార్గెట్ చేసుకున్నారు. మరోవైపు దాదపు 57 స్థానాలు ఇప్పుడు నితీష్ కుమార్ గెలుపోటములకు కీలకంగా మారాయి. లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయి పోటీ చేయడంతో ఆ ప్రభావం అధికార పార్టీపైనే ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అందరి టార్గెట్……
బీజేపీ కూడా తన ఎన్నికల ప్రచారంలో నితీష్ కుమార్ ఫొటోలను వినియోగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్ని మోదీ ఫొటోలతోనే బీజేపీ నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో పాటు లోక్ జనశక్తి పార్టీ టార్గెట్ నితీష్ కుమార్ అయ్యారు. దీంతో ఆయన ఈసారి ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న చర్చ బీహార్ లో జోరుగా జరుగుతుంది. మరి కొద్ది గంటల్లో నితీష్ కుమార్ భవితవ్యం తేలిపోతుంది.
.