ఎ.. తర్వాత బి.. కదా.. నితీష్ కుమార్ కు?
అనుకున్నట్లుగానే జరుగుగుతుంది. క్రమంగా నితీష్ కుమార్ ను బీజేపీ టార్గెట్ చేస్తుంది. బీహార్ విషయంలో ఇంకా స్పీడ్ పెంచక పోయినా ఇతర రాష్ట్రాల్లో జేడీయూను బలహీన పర్చేందుకు [more]
అనుకున్నట్లుగానే జరుగుగుతుంది. క్రమంగా నితీష్ కుమార్ ను బీజేపీ టార్గెట్ చేస్తుంది. బీహార్ విషయంలో ఇంకా స్పీడ్ పెంచక పోయినా ఇతర రాష్ట్రాల్లో జేడీయూను బలహీన పర్చేందుకు [more]
అనుకున్నట్లుగానే జరుగుగుతుంది. క్రమంగా నితీష్ కుమార్ ను బీజేపీ టార్గెట్ చేస్తుంది. బీహార్ విషయంలో ఇంకా స్పీడ్ పెంచక పోయినా ఇతర రాష్ట్రాల్లో జేడీయూను బలహీన పర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. జేడీయూ ను క్రమంగా వీక్ చేసి బీహార్ లోనూ ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అధిష్టించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకున్నట్లే కన్పిస్తుంది. అయితే దీనికి బీజేపీ కొంత సమయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది.
పెద్ద పార్టీగా అవతరించినా…..?
బీహార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూకు తక్కువ స్థానాలు ఇచ్చినా ముందుగా ఇచ్చిన మాట ప్రకారం జేడీయూ అధినేత నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసింది. మంత్రి పదవుల విషయంలో మాత్రం బీజేపీదే పైచేయి అయింది. ఒకరకంగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నప్పటికీ నిర్ణయాలన్ని అమలు చేసేది బీజేపీయేనన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ కు కొంత సమయం ఇచ్చి తర్వాత ఆయనను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవాలన్నది బీజేపీ యోచనగా కన్పిస్తుంది.
మిత్రపక్షాన్నే తమలో….
తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సంఘటన చూస్తే అదే నిజమనిపిస్తుంది. బీజేపీకి జేడీయూ మిత్రపక్షం. జేడీయూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినా ఆ పార్టీ అన్ని అంశాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది. బీహార్ లో రెండు పార్టీలు కలసి అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరుణా చల్ ప్రదేశ్ లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీజేపీలో చేరారు. ఉన్న ఏడుగురిలో ఆరుగురిని బీజేపీ తన పార్టీ లో చేర్చుకుని నితీష్ కుమార్ కు షాక్ ఇచ్చింది.
తర్వాత బీహారేనట….
60 మంది సభ్యులగల అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీకి ఇప్పటికే నలభై మందికి పైగా సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే ఉన్నారు. కానీ అక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించింది. మిత్రపక్షమైన జేడీయూనే టార్గెట్ చేసింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ నేతలు బీజేపీ పై ఫైర్ అవుతున్నారు. కానీ బీజేపీ మద్దతుతోనే ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ మాత్రం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత బీహార్ పైనే బీజేపీ దృష్టి పెడతారంటున్నారు. ఎ తర్వాత బీ యే కదా మరి.