కటీఫ్ గ్యారంటీ….కాని వారితో కలిసేది మాత్రం?
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. జరగకపోతేనే రాజకీయాలను తప్పు పట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. బీహార్ లోనూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణలు మారే అవకాశముందంటున్నారు. కూటముల్లో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. జరగకపోతేనే రాజకీయాలను తప్పు పట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. బీహార్ లోనూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణలు మారే అవకాశముందంటున్నారు. కూటముల్లో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. జరగకపోతేనే రాజకీయాలను తప్పు పట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. బీహార్ లోనూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణలు మారే అవకాశముందంటున్నారు. కూటముల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశ ముందం టున్నారు. బీజేపీతో జనతాదళ్ యు నేత తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీయడమేనని జేడీయూ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.
బీజేపీతో చేతులు కలిపి….
అయితే బీజేపీ నుంచి బయటకు వచ్చి ఇతర పార్టీలతో కలసి పోటీ చేసే అవకాశాలూ నితీష్ కుమార్ కు తక్కువే. గతంలో మహా గడ్బంధన్ గా ఏర్పడి అధకారంలోకి వచ్చిన నితీష్ కుమార్ అనంతర కాలంలో లాలూ ఫ్యామిలీ అవినీతిని బూచిగా చూపించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. అయితే జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నితీష్ కుమార్ కు రుచించడం లేదు. వరసగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పాటు కావడం కూడా నితీష్ కుమార్ ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.
షాకిచ్చి… బీజేపీకి…..
అందుకే బీజేపీ భాగస్వామిగా ఉంటూ ఆ పార్టీకే షాకిచ్చింది. తాజాగా బీహార్ ప్రభుత్వం ఎన్సార్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం విశేషం. అంతేకాదు 2010 లో ఉన్న ఎన్పీఆర్ నే అమలు చేయాలని తీర్మానం చేసింది. దీంతో ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి ఎన్డీఏ పాలిత రాష్ట్రం బీహార్ కావడం విశేషం. గతంలో ఎన్సార్సీకి పార్లమెంటులో జేడీయూ మద్దతు పలికినప్పటికీ, రాష్ట్రానికి వచ్చేసరికి నితీష్ కుమార్ అమలు పర్చడం లేదని వ్యతిరేకించడం చర్చకు దారి తీసింది.
ఒంటరిగానే బరిలోకి…..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్సార్సీపై తీర్మానం అయిన తర్వాత వీరి భేటీ జరగడంతో రాజకీయంగా చర్చకు దారి తీసింది. మరోసారి ఆర్జేడీ, జేడీయూలు కలసి పోతాయా?అన్న చర్చ కూడా జరిగింది. అయితే జేడీయూ మాత్రం ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీతో నితీష్ కటీఫ్ చెబుతారన్న ప్రచారమూ బీహార్ లో విస్తృతంగా జరుగుతుండటం విశేషం.