బీహార్ లో నితీష్ వ్యూహం ఇదేనా?

బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరోసారి విజయం సాధించాలన్న ధీమాతో నితీష్ కుమార్ ఉన్నారు. ప్రధానంగా తన పాలనలో తీసుకున్న నిర్ణయాలు తనను గట్టెక్కిస్తాయని నితీష్ కుమార్ గట్టిగా [more]

Update: 2020-10-01 18:29 GMT

బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరోసారి విజయం సాధించాలన్న ధీమాతో నితీష్ కుమార్ ఉన్నారు. ప్రధానంగా తన పాలనలో తీసుకున్న నిర్ణయాలు తనను గట్టెక్కిస్తాయని నితీష్ కుమార్ గట్టిగా విశ్వసిస్తున్నారు. మద్యనిషేధం తో మహిళల ఓట్లు తమ వైపే ఉంటాయని నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీల బలహీనతలు కూడా తనకు కలసి వస్తాయన్నది నితీష్ కుమార్ అంచనాగా ఉంది.

ఓటర్లను ఆకర్షించేందుకు…..

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఇప్పటికే బీహార్ రాజకీయంగా వేడెక్కింది. అన్ని పార్టీలూ ప్రచారానికి దిగాయి. అభ్యర్థుల ఎంపిక కాకపోయినప్పలికీ కూటమి కూడా ఏర్పాటయ్యాయి. బీహార్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జనతాదళ్ యు, ఎల్జేపీ, బీజేపీలు ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. మూడు పార్టీలూ మూడు ప్రధాన వర్గాలకు చెందిన ఓట్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

మూడు పార్టీలూ ఇలా….

బీజేపీ హిందువుల ఓట్లను ఎటూ రాబట్టుకుంటుంది. అందుకోసమే నియోజకవర్గంలో ఆధిపత్యం ఉన్న సామాజిక వర్గాల వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. పార్టీ కాకున్నా అభ్యర్థులను చూసి ఓట్లేసేలా ఆ సామాజిక వర్గాలను ఆకర్షించే విధంగా ఈ మూడు పార్టీలు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. జేడీయూ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నీడ తన వెంట ఉన్నా ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ముస్లిం మహిళల ఓట్లను రాబట్టుకోవాలనియ యత్నిస్తుంది.

అభివృద్ధిపైనే…..

ఇక లోక్ జనశక్తి పార్టీ దళిత ఓట్లపైనే ఎక్కువగా గురిపెట్టింది. నితీష్ కుమార్ తన పాలనలో బీహార్ లో చేసిన అభివృద్ధినే ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. తనపై విశ్వాసం ఉంచి ఓటేయాలని నితీష్ కుమార్ కోరుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనుంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో నితీష్ కుమార్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీహారీలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News