ఆరునెలలేనట.. ఆ తర్వాత?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషంగా లేరు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కినప్పటికీ పూర్తి స్థాయి పాలనాధికారాలు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల [more]

Update: 2021-01-16 16:30 GMT

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషంగా లేరు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కినప్పటికీ పూర్తి స్థాయి పాలనాధికారాలు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సయితం అమలు పర్చే ప్రయత్నం చేస్తున్నా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటం నితీష్ కుమార్ కు చికాకును తెప్పిస్తుందని చెప్పాలి. దీంతో ఆయన ఆరు నెలల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది.

ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా…..

బీహార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీయూకు తక్కు స్థానాలు వచ్చినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం బీజేపీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నే చేసింది. ఆయనే తమ నాయకుడని ప్రకటించింది. అయితే కాలం గడిచే కొద్దీ నితీష్ కుమార్ పై బీజేపీ నేతలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కొందరు మంత్రులయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తెలియకుండానే నిర్ణయం తీసుకుంటున్నారు.

బీజేపీపై అసంతృప్తి…..

దీంతో నీతీష్ కుమార్ ఇటీవల పార్టీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీ మీద నితీష్ కుమార్ కు పీకలదాకా కోపం ఉంది. అరుణా చల్ ప్రదేశ్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. అప్పుడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని భావించినా బీజేపీ పెద్దల సూచన మేరకు ఆలోచనను నితీష్ కుమార్ విరమించుకున్నట్లు తెలిసింది.

రాజకీయాల నుంచి…..

ఇక రాను రాను బీజేపీ ప్రభుత్వం లాగానే బీహార్ లో వ్యవహరిస్తుండటం ఆయనకు ఇబ్బంది కరంగా మారింది. ప్రధానంగా రైతు సమస్యలపై కూడా నితీష్ కుమార్ కేంద్ర వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆరు నెలల్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండటమే బెటర్ అని నితీష్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఇబ్బందిగానే ఉన్నారన్నది వాస్తవం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News