నితీష్ కు పదవీ గండం తప్పదా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీహార్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. జేడీయూను [more]

Update: 2021-05-17 18:29 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీహార్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. జేడీయూను బీహార్ లో వీక్ చేసే పనిలో బీజేపీ ఉందంటున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి బీజేపీ నేతలను పీఠం ఎక్కించాలన్నది కమలనాధుల వ్యూహంగా కన్పిస్తుంది.

ఇచ్చిన మాట ప్రకారం…..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు తక్కువ స్థానాలు వచ్చినా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నితీష్ కుమార్ నే బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. మిత్రపక్షానికి తామ ఇచ్చే ప్రాధాన్యత ఇదీ అని డప్పాలు కొట్టుకుంది. అయితే క్రమంగా నితీష్ కుమార్ కు సెగ మొదలయిందంటున్నారు. నితీష్ కుమార్ ను పదవి నుంచి తప్పిస్తే జేడీయూలో తిరుగుబాటు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

జాతీయ రాజకీయాల్లో….

నితీష్ కుమార్ ను బీహార్ రాజకీయాల నుంచి తప్పించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది కమలనాధుల ఆలోచనగా ఉంది. మోదీ త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. దీంతో నితీష్ కుమార్ తో పాటు మరో ఇద్దరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించాలన్న యోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. అయితే ఆయనకు చికాకు తెప్పించేందుకు చిరాగ్ పాశ్వాన్ ను వినియోగిస్తారని తెలుస్తోంది.

చిరాగ్ తో చికాకు తెప్పించి…..

చిరాగ్ పాశ్వాన్ కారణంగా గత ఎన్నికల్లో జేడీయూ అతి తక్కువ స్థానాలను దక్కించుకుంది. తిరిగి చిరాగ్ ను ఎన్డీఏలోకి తీసుకోవడం ద్వారా నితీష్ కుమార్ కు చికాకు తెప్పించాలన్నది బీజేపీ అధిష్టానం యోచనగా ఉంది. అయితే మరోవైపు ప్రత్యర్థి ఆర్జేడీ కూటమి కూడా బలంగా ఉంది. ఏమాత్రం తప్పటడుగులు పడినా ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. అందుకే నితీష్ కుమార్ ను ఒప్పించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలన్నది బీజేపీ యోచన. అయితే ఇందుకు నితీష్ కుమార్ ఏ మేరకు అంగీకరిస్తారన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News