ఆయన వైసీపీకి అక్కర్లేదుట

విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. పెళ్ళి కాకుండానే మంత్రి [more]

Update: 2019-10-09 00:30 GMT

విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. పెళ్ళి కాకుండానే మంత్రి అయి కొత్త రికార్డ్ ఆనాడు సృష్టించారు. మంత్రి అయి పెళ్ళి చెసుకున్నారు కూడా. ఇక అయ్యన్నపాత్రుడు ఇప్పటికి పదిసార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిస్తే ఆరుసార్లు మంత్రిగా పనిచేసి చాలా కీలకమైన శాఖలను చూశారు. టీడీపీలో సాధారణ నాయకుడి నుంచి పొలిటి బ్యూరో మెంబర్ దాకా ఎదిగారు. నాడు ఎన్టీయార్ కి తరువాత చంద్రబాబుకు సన్నిహితునిగా మారి తనదైన రాజకీయాన్ని విశాఖ జిల్లాలో చేస్తూ అయ్యన్నపాత్రుడు శాసిస్తున్నారు. అటువంటి అయ్యన్న పాత్రుడు ఇప్పటికి మూడుసార్లు ఓడితే తాజా ఎన్నికల్లో పాతిక వేల పై చిలుకు ఓట్లతో దారుణంగా పరాజయం పాలు అయ్యారు.

తమ్ముడి బలం ఇంతేనా?

ఇక అయ్యన్నపాత్రుడుకు అన్ని విధాలుగా తోడు నీడగా ఉన్న తమ్ముడు చింతకాయల సన్యాసిపాత్రుదు నెల రోజుల క్రితం పార్టీకి దూరమయ్యారు. ఆయన నర్శీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్మన్ గా ఉన్న్నారు. ఆయన సతీమణి చైర్ పర్సన్ గా పనిచేశారు. ఇక మునిసిపాలిటీలొ మంచి పట్టు ఉందని భావించిన సన్యాసిపాత్రుడు అన్న అయ్యన్నపాత్రుడు మీద తిరగబడ్డారు. అయ్యన్నపాత్రుడు తరువాత తానే రాజకీయ వారసుడిని అనుకుంటే అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ తనకు అడ్డుగా రావడాన్ని తట్టుకోలేక పార్టీని వీడారు, నిజానికి అయ్యన్నపాత్రుడు పేరుకు మంత్రిగా ఉన్నా అన్ని వ్యవహారాలను సన్యాసిపాత్రుడు చూసేవారు. దాంతో నర్శీపట్నంలో మొత్తం పట్టు తనకే ఉందని అనుకున్నారు. తీరా టీడీపీకి రాజీనామా చేశాక సన్యాసిపాత్రుడు వెనకాల కనీసం పది మంది నాయకులు కూడా లేరుట. మాజీ మంత్రి తమ్ముడు కదా ఆయన్ని చేర్చుకుంటే ఎంతో లాభమని, అయ్యన్నపాత్రుడుకు కూసాలు కదిలిపోయే షాక్ ఇవ్వొచ్చు అని భావించిన వైసీపీ నేతలు సైతం సన్యాసిపాత్రుడు బలం చూసి నీరుకారిపోయారట.

వైసీపీలో చేర్చుకుంటారా?

ఇదిలా ఉండగా సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరేందుకు అమరావతి అయిదు కార్లలో తాజాగా బయలుదేరితే ఆయనకు ప్రయాణం మధ్యలోనే రావద్దు అని వైసీపీ హై కమాండ్ నుంచి కబురు వచ్చిందట. దాంతో షాక్ తినడం సన్యాసిపాత్రుడు వంతు అయిందట. కనీసం వంద కార్లో వచ్చి వందల మంది అనుచరులతో అయ్యన్నపాత్రుడు సోదరుడు జగన్ సమక్షలో చేరితే విశాఖ జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ పడుతుందని వైసీపీ హైకమాండ్ భావించిందట. కానీ కేవలం అయిదు కార్లలో మాత్రమే సన్యాసిపాత్రుడు రావడం, అందులో కూడా ఉన్న వారంతా వైసీపీ నేతలే కావడంతో ఇపుడు కాదు మరోసారి రండి అంటూ దార్లోనే సమాచారం పంపించి ఇంటిదారి చూపించిదట వైసీపీ హై కమాండ్. ఇదిపుడు జిల్లా రాజకీయల్లో చర్చగా ఉంది. సన్యాసిపాత్రుడు వెంట టీడీపీ నాయకులు ఎవరూ లేకపోవడంతో ఆయన్ని చేర్చుకుని ప్రయోజనం ఏముందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. మొత్తానికి అయ్యన్నపాత్రుడు తమ్ముడికి వైసీపీ తనదైన ఝలక్ ఇచ్చి రెంటికీ చెడ్డగా మార్చేశారని అంటున్నారు.

Tags:    

Similar News