ఆ పదవుల్లో ఎమ్మెల్యేలకే ప్రయారిటీ… ఇక చూస్కోండి

ఏపీలో అధికార వైసీపీలో మ‌రో ప‌ద‌వుల పండ‌గ‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత‌ల‌కు పెద్దచిక్కే వ‌చ్చింది. నిన్న మొన్నటి వ‌ర‌కు ఎమ్మెల్యేను లెక్కచేయ‌ని వారు [more]

Update: 2021-07-10 06:30 GMT

ఏపీలో అధికార వైసీపీలో మ‌రో ప‌ద‌వుల పండ‌గ‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత‌ల‌కు పెద్దచిక్కే వ‌చ్చింది. నిన్న మొన్నటి వ‌ర‌కు ఎమ్మెల్యేను లెక్కచేయ‌ని వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల‌ క‌రుణ కోసం క్యూ క‌డుతున్నారు. ఎమ్మెల్యే కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌నే ధిక్కరించిన వారిపై ఇప్పుడు స‌డెన్‌గా ఎమ్మెల్యేల‌పై ప్రేమ ఎందుకు పుట్టుకు వ‌చ్చింద‌నుకుంటున్నారా ? అంటే.. ప‌ద‌వులే! అంటున్నారు పార్టీ నేత‌లు. ఇప్పటి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు ప్రతి జిల్లాకు నాలుగు రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ పదవుల కోసం పలువురు ముఖ్య నేతలు పోటీపడుతున్నారు. అందులో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ రీజినల్‌ చైౖర్మన్‌, మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్ లాంటి కీల‌క చైర్మన్ ప‌ద‌వుల‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయ‌నున్నార‌ట‌.

ప్రాధాన్యత ఎలా అంటే..?

అంటే ఒకే ప్రాంతానికే చెందిన నాయ‌కుల‌కే అన్ని కీల‌క ప‌ద‌వులు ద‌క్కకుండా ప‌ద‌వుల‌ను ప్రాధాన్యత‌ను బ‌ట్టి ప్రాంతాల వారీగా విభ‌జిస్తున్నార‌ట‌. ఈ ప‌ద‌వుల పంప‌కాల‌పై అధిష్టానం నుంచి సంకేతాలు రావ‌డంతో నేత‌ల కోలాహ‌లం, ఎమ్మెల్యేల చుట్టూ ప్రద‌క్షిణ‌లు మామూలుగా లేవు. ఒక్కో జిల్లాకు కేవ‌లం నాలుగు ప‌ద‌వులు మాత్రమే ఇస్తామ‌ని పై నుంచి సంకేతాలు వ‌చ్చినా.. ఆయా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్న వారి సంఖ్య భారీగా ఉంది. అయితే, ఆది నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యతనివ్వాలన్నది అధిష్టానం నిర్ణయంగా చెబుతున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినప్పటికీ దక్కని నేతలు, మేయర్‌ పదవులు ఆ శించిన నాయకులకు నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా, రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులకు ఆ స్థాయి ఉన్న నాయకులు పోటీపడుతున్నారు.

సీల్డ్ కవర్ లో…..

జిల్లా, రాష్ట్రస్థాయి చైర్మన్‌ పదవులను ఆశిస్తున్న నాయకుల పేర్లను స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి వారు ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సీల్డ్‌ కవర్లో అందజేసినట్లు సమాచారం. నామినేటెడ్‌ పదవులు తమ అనుయాయులకు దక్కే విధంగా ప్రజాప్రతినిధులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవ‌రికి వారు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌కే ప‌ద‌వులు సాధించుకోవాల‌ని చేస్తోన్న రాజ‌కీయంలో ఎమ్మెల్యేల మ‌ధ్య ఆధిప‌త్య ర‌గ‌డ రాజుకుంద‌ట‌. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల మ‌ధ్య ఈ ర‌గ‌డ కామ‌న్ అయిపోయింది. ఆర్థిక, సామాజిక బలాబలాలను బేరీజు వేస్తూ ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ద‌క్కింద‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఎందుకంటే ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వారికి కూడా ప‌ద‌వులు రాలేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల క‌న్నీళ్లు తుడ‌వడానికే వాళ్లకు ప్ర‌యార్టీ ఇస్తున్నట్టు భోగ‌ట్టా. మ‌రి నామినేటెడ్ ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయో చూడాలి.

Tags:    

Similar News