భారతీయుల సత్తా ఏంటో ఇది చూశాక?
ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన, పాలించిన బ్రిటన్ లో నేడు ప్రవాస భారతీయులు సత్తాచాటుతున్నారు. ఆర్దిక, సామాజిక, సేవా రంగాల్లో దుాసుకుపోతున్నారు. ముఖ్యంగా [more]
ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన, పాలించిన బ్రిటన్ లో నేడు ప్రవాస భారతీయులు సత్తాచాటుతున్నారు. ఆర్దిక, సామాజిక, సేవా రంగాల్లో దుాసుకుపోతున్నారు. ముఖ్యంగా [more]
ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో శాసించిన, పాలించిన బ్రిటన్ లో నేడు ప్రవాస భారతీయులు సత్తాచాటుతున్నారు. ఆర్దిక, సామాజిక, సేవా రంగాల్లో దుాసుకుపోతున్నారు. ముఖ్యంగా రాజకీయరంగంలో కీలకపాత్ర పోషిస్తుా విధాన నిర్మాతలుగా వెలుగొందుతున్నారు. ప్రధాని తరువాత అత్యంత కీలకమైన ఆర్దిక, హోంమంత్రులుగా ప్రవాస భారతీయులు బ్రిటన్ రాజకీయరంగంలో కీలకపాత్రపోషిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొలువూదీరిన బ్రిటన్ మంత్రివర్గంలో భారతీయులు కీలక పదవులు చేజిక్కించుకున్నారు. అత్యంత కీలకమైన ఆర్ధికమంత్రిగా రిషీ సునాక్, హోంమంత్రిగా ప్రీతిపటేల్. పారిశ్రామిక, ఇంధన, వాణిజ్యమంత్రులుగా అలోక్ శర్మ, మరో మంత్రిగా సుమెాల్లా బ్రౌవర్ మన్ భాద్యతలు చేపట్టారు. విధాన నిర్నయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
నారాయణమూర్తి అల్లుడు….
వీరిలో యువకుడైన రిషీ సునాక్ భారతీయ దిగ్గజం సాఫ్టవేర్ సంస్ధ అధినేత ఆర్. నారాయణముార్తి అల్లుడు కావడం విశేషం. నారాయణముార్తి కుాతురు అక్షతను ఆయన చదువుకునే సమయంలో ప్రేమించి పెళ్ళిచే సుకున్నారు. ప్రధాని తర్వాత ఆర్ధికశాఖ అత్యంత కీలకమైనది. రిషీ సునాక్ ఆక్స ఫర్డ్ యుానివర్శిటీలో ఆర్ధిక, తత్వ, రాజకీయ శాస్త్రాలలో పీజీ చేశారు. తర్వాత స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎమ్.బి.ఎ చేశారు. అనంతరం ఇన్వెస్టుమెంట్ బ్యాకింగ్ రంగంలో పనిచేశారు. తరువాత కాలంలో వివిధ సంస్ధలలో భాధ్యతలు నిర్వహించారు. స్టాన్ ఫర్ట్ లో చదివేరోజుల్లో పరిచయమైన నారాయణముార్తి కుాతురు అక్షతతో 2009 లో వివాహమైంది. అల్లుడు రాజకీయ అంశాలపై అత్తమామలు నారాయణముార్తి, సుధాముార్తి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. గతఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఉత్తర ఇంగ్లాండులోని యార్క్ షైర్ ప్రాంతంలోని రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రిషీ సునాక్ ఈ స్ధానం నుంచి వరుసగా 2015, 2017, 2010 ల్లో గెలుపొందారు. ఈనియెాజక వర్గంలో ఒటర్లు 97 శాతం మంది శ్వేతజాతీయులే. ఎక్కువగా గ్రామీణ ప్రాంతమే. ప్రవాస భారతీయులు నియోజకవర్గంలో తక్కువే అయినా రిషీ సునాక్ గెలుపొందడం విశేషం. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ కు ముందు ధెరస్సామే మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖామంత్రిగా పనిచేశారు. ఆర్ధిక రంగంలో రిషీ సునాక్ ప్రతిభాపాటవాలను గుర్తించిన బోరిస్ జాన్సన్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతకు ముందు ఆర్ధిక మంత్రిగా పాకిస్ధాన్ జాతీయుడైన సాజిద్ హుస్సేన్ ఉండేవారు. రాజకీయ విభేదాల కారణంగా జాన్సన్ ఆయనను పక్కకు పెట్టారు.
మోదీకి మద్దతుదారుగా….
బ్రిటన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరో ప్రవాస భారతీయురాలు ప్రీతి పటేల్. ఆమె అత్యంత కీలకమైన హోంమంత్రిగా చక్రం తిప్పుతున్నారు. గుజరాత్ కు చెందిన ఆమె బ్రిటన్ లో స్ధిరపడ్డారు. ఆమె 2010 నుంచి ‘ విధమ్ ‘ నియెాజక వర్గం నుంచి ఎన్నికవుతుా వస్తున్నారు. 2016 నుంచి కన్సర్ వేటివ్ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. కీలే యుానివర్శిటీ , యుానివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ లో విధ్యాబ్యాసం చేశారు. బోలిన్ జాన్సన్ కు ముందు ధెరెస్సా మంత్రి వర్గంలో అంతర్జాతీయ వ్యవహారాలు, ఉపాధికల్పన శాఖల మంత్రిగా తన సమర‌్ధతను చాటుకున్నారు. అంతకు ముందు డేవిడ్ కెమెరాన్ మంత్రివర్గంలోనుా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవం ప్రీతి పటేల్ రాజకీయంగా ప్రధాని మెాదీకి గట్టి మద్దతుగా మారారు. ఆయన విధానాలను, కార్యక్రమాలను, పథకాలను బ్రిటన్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. వేంకటేశ్వరస్వామి భక్తురాలు అయిన ప్రీతి పటేల్ లండన్ లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని తరచూ సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని సంరర్శించిన తర్వాతే ఆమె గత ఎన్నికల్లో ప్రచారానికి శ్రీకారంచుట్టారు. ప్రధాని జాన్సన్ ను కుాడా ఆలయానికి తీసుకెళ్ళారు. మరో ప్రవాస భారతీయుడు అలోక్ శర్మ(52) కుాడా బ్రిటన్ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. పారిశ్రామిక, ఇంధన, వాణిజ్యమంత్రిగా ఆయన సమర్ధంగా పని చేస్తుా ప్రధాని బోరిన్ జాన్సన్ దృష్టిలో పడ్డారు. ఒకప్పుడు భారత దేశాన్ని ఏలిన బ్రిటన్ ఇపుడు అదే భారతీయుల సేవలను, ప‌్రవాస పాటవాలను గుర్తించి గౌరవించగడం విశేషం. ఇది శుభసుాచికం. మున్ముందు బ్రిటన్ రాజకీయాల్లో ప్రవాసభారతీయులు మరింత కీలకపాత్ర పోషించాలని ఆశిద్దాం.
-ఎడిటోరియల్ డెస్క్