ఏకాకి జీవితం నాది

మాజీ మంత్రి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, దేవినేని ఉమామహేశ్వరరావు గతంలోలా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. చాలా రోజుల త‌ర్వాత అసెంబ్లీ [more]

Update: 2019-08-03 03:30 GMT

మాజీ మంత్రి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, దేవినేని ఉమామహేశ్వరరావు గతంలోలా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. చాలా రోజుల త‌ర్వాత అసెంబ్లీ స‌మావేశాల‌పై ముక్తస‌రిగా వైసీపీని విమ‌ర్శించిన ఆయ‌న ఎందుకో అటు జిల్లా రాజ‌కీయాల్లోనూ అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. నందిగామ‌, ఆ త‌ర్వాత వరుసగా మైలవరం నుంచి విజయాలు సాధించిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో చతికిల పడ్డారు. అయితే, దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమికి.. వైసీపీతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తెరవెనుక చక్రం తిప్పారనే ప్రచారం ఉంది.

అంతర్గత విభేదాలు….

అయినప్పటికీ.. ఎన్నికల తర్వాత చురుగ్గానే మీడియా ముందుకు వచ్చారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఎంత ఓడిపోయినా..అటు పార్టీలోను, ఇటు ప్రజల్లోనూ తన హవా తగ్గలేదంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో జగన్‌ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్‌ చేశారు. ఇక, తనకు అత్యంత ప్రియమైన శత్రువు, వైసీపీ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి పైనా ట్వీట్లతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం పథకాన్ని జగన్‌ ప్రారంభించడంపైనా విమర్శలు దేవినేని ఉమామహేశ్వరరావు గుప్పించారు. దీనికి ప్రతిగా విజయసాయి కౌంటర్లు ఇచ్చారు. ఇలా సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా టీడీపీలో దేవినేని కేంద్రంగా అంతర్గత వివాదాలు తెరమీదికి వచ్చాయి.

ఎవరూ మద్దతుగా లేక….

కృష్ణా జిల్లా టీడీపీని దేవినేని ఉమామహేశ్వరరావు నాశనం చేశారనే వాదన అంతర్గతంగా బలపడింది. దీనికి బలాన్ని చేకూర్చేలా విజయవాడ నుంచి గెలిచిన ఎంపీ కేశినేని నాని.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి జగన్‌ కేబినెట్‌లో బెర్త్‌ లభించడం వెనుక రీజన్‌ దేవినేనేనని, కొడాలి ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పుకోవాల్సి వస్తే.. అది ఒక్క దేవినేనేనని ట్విట్టర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని కమ్మ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించకపోగా.. దేవినేని ఉమామహేశ్వరరావు కి మద్దతుగా ఒక్కరు కూడా గళం విప్పలేదు. ఈ పరిణామాలతో దేవినేని ఒకింత హర్ట్‌ అయ్యారని సమాచారం. నిజానికి ఆయ‌న‌ మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఆధిపత్యం చలాయించారని, ఎమ్మెల్యేలను నోరు మెదపనివ్వలేదని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.

కోటరీని పెంచుకునేందుకే….

జిల్లా ప్రజాప్రతినిధుల్లో కొందరిని మాత్రమే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, తన కోటరీని పెంచుకునేందుకు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నిం చారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల్లో ఓడిపోవాలని వైసీపీ నేతల కంటే కూడా టీడీపీ నాయకులే ఎక్కువగా కోరుకున్నారని ప్రచారం జరిగింది. మరి పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆయనను మౌనం పాటించమని ఆదేశించారా? అనే చర్చ కూడా సాగుతోంది. అటు ఎన్నిక‌ల్లో ఓట‌మి… ఇటు కేశినేనికి టార్గెట్ అవ్వడం కూడా దేవినేని ఉమామహేశ్వరరావు కాస్త స్లో అయిన‌ట్టే ఉంది. ఏదేమైనా.. దేవినేని తన హద్దులు తెలుసుకున్నారనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పార్టీలో ఒంటరి అయిపోయారంటున్నారు.

Tags:    

Similar News