మరిన్ని ఆంక్షలు ఎత్తేసి …. 5.0 లాక్ డౌన్ ఇదేనా?

భారత్ లో లాక్ డౌన్ 5.0 ఉండబోతుందా..? లేదా ? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి వైరస్ తీవ్రంగా [more]

Update: 2020-05-27 17:30 GMT

భారత్ లో లాక్ డౌన్ 5.0 ఉండబోతుందా..? లేదా ? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతుంది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నాయి. మరోపక్క ఆంక్షలు తొలగించాలన్న డిమాండ్ లు మొదలు అయ్యాయి. హోటల్ పరిశ్రమ తో పాటు, సినిమా ఇండస్ట్రీ ఇంకోపక్క విద్యా వ్యవస్థలు ఎప్పటికి పూర్తిస్థాయిలో పనిచేస్తాయో అర్ధంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర క్యాబినెట్ భేటీ ఉత్కంఠ రేపుతోంది.

లాక్ డౌన్ 4 లాగే …

తాళం వేసి గొళ్ళెం మరిచిన చందంగా లాక్ డౌన్ 4.0 భారత్ లో అమలౌతుంది. ప్రభుత్వం లాక్ డౌన్ విధించామని పేరుకి చెబితే , ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నామని నటిస్తున్నారు. ఇలా సాగుతుంది లాక్ డౌన్. అయితే ఆర్ధిక గమనం సాగకపోతే ఆకలి చావులు దేశంలో తప్పవని తేలడంతో ఒక్కో లాక్ డౌన్ కి నిబంధనలు సడలిస్తూ ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ప్లాన్ లో ముందుకు వెళుతుంది కేంద్రం. మన దేశంలో జూన్ జులై లో అత్యధిక కేసులు నమోదు కానున్నాయన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో లాక్ డౌన్ 5.0 తప్పదనే అంచనా వేస్తున్నారు.

జులై నుంచి విద్యా సంవత్సరం …

మార్చి చివరి వారం నుంచి క్లోజ్ అయిన విద్యా వ్యవస్థను రీఓపెన్ చేయడానికి కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఎలాంటి నిబంధనలతో మొదలు పెట్టాలి అనే అంశంపై కార్యాచరణ సిద్ధం అవుతుందని అంటున్నారు. జులై నుంచి విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టాలని అయితే 7 వ తరగతి పై క్లాస్ లకు ముందుగా అనుమతి ఇచ్చి మిగిలిన తరగతులు వారికి ఇళ్ళదగ్గరే విద్యాభ్యాసం జరిగేలా విధానం రూపొందించాలని ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తుంది.

నిబంధనలను సడలిస్తూనే?

చిన్న వయస్సు వారు, పెద్ద వయస్సు వారు కరోనా బారిన పడితే కోలుకోవడం కష్టమని వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆ సూచనలు పాటిస్తూ 10 సంవత్సరాలు పైబడి ఉన్న వారినే తరగతులకు అనుమతించడం మంచిదని భావిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జూన్ తో లాక్ డౌన్ ఉందనుకోవడానికి వీలు లేదని కొన్ని నిబంధనలు సడలిస్తూనే క్యాబినెట్ 5 వ లాక్ డౌన్ లోకి అడుగు పెడుతుందని దీనిపై గతంలోలాగే అన్ని రాష్ట్రాలతో మరోసారి చర్చిస్తారని చెబుతున్నారు. ఈనెల 31 తో లాక్ డౌన్ ముగియనుండటంతో కేంద్రం అడుగులు ఎటువైపు అన్నది పెద్ద చర్చకు మాత్రం దేశంలో తెరతీసింది.

Tags:    

Similar News