Andhra : ఏపీలో మళ్లీ ఎన్నికలు.. జనసేన, టీడీపీ అవగాహన?

మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మిగిలిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ [more]

Update: 2021-10-18 12:30 GMT

మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మిగిలిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 23వ తేదీన విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారనుంది. అయితే జనసేన, టీడీపీ పొత్తు ఈ ఎన్నికలతోనే ప్రారంభమవుతుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

నెల్లూరు కార్పొరేషన్ తో పాటు…

నెల్లూరు కార్పొరేషన్ తో పాటు రాష్ట్రంలో పన్నెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రకాశం జిల్లా దర్శి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ, కడప జిల్లా కమలాపురం, రాజంపేట, బేతంచర్ల, నెల్లూరు జిల్లాలోని, బుచ్చిరెడ్డి పాలెం, కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కృష్ణా జిల్లా ఆకివీడు, జగ్గయ్య పేట, కొండపల్లి, అనంతపురం జిల్లాలోని పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగనున్నాయి. 23న నోటిఫికేషన్ వస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టాయి

పోటీ చేయాల్సిందేనని….

అయితే పరిషత్, బద్వేలు ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల విష‍యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నెల్లూరు కార్పొరేషన్ లో ఖచ్చితంగా పోట ీచేయాలి. నెల్లూరు రూరల్, టౌన్ నియోజకవర్గాలు ఇందులో ఉన్నందున వచ్చే ఎన్నికలకు ఇది ట్రయల్ గా ఉండబోతుంది. అందుకే టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని భావిస్తున్నారు. స్థానిక నాయకత్వం కూడా పోటీకే మొగ్గు చూపుతున్నారు.

అవగాహనతోనేనా?

కానీ వైసీపీని నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనాలంటే జనసేన తో కలవాలని కొందరు సూచిస్తున్నారు. అధికారికంగా పొత్తు లేకపోయినా అవగాహనతో కలసి నడిస్తే వైసీపీని ఢీకొట్టవచ్చని ఇప్పటికే నెల్లూరు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. మరో వైపు నెల్లూరులో బీజేపీ కూడా కొంత ఓటు బ్యాంకును కలిగి ఉంది. దీంతో జనసేన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News