ఇమ్రాన్ ఇదేం పోయేకాలం?

కరోనా కష్టకాలంలోనుా దాయాది దేశం పాకిస్ధాన్ కరకు వైఖరి మారడం లేదు. నిత్యం నియంత్రణరేఖ వద్ద కాల్పులకు దిగుతుా, చొరబాట్లకు పాల్పడుతుా భారత్ ను చికాకు పరుస్తోంది. [more]

Update: 2020-05-28 16:30 GMT

కరోనా కష్టకాలంలోనుా దాయాది దేశం పాకిస్ధాన్ కరకు వైఖరి మారడం లేదు. నిత్యం నియంత్రణరేఖ వద్ద కాల్పులకు దిగుతుా, చొరబాట్లకు పాల్పడుతుా భారత్ ను చికాకు పరుస్తోంది. తాజాగా గిల్గిత్-బాల్టిస్ధాన్ లో ఎన్నికలకు తెరలేపుతుా భారత్ సహనాన్ని పరీక్షిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్నప్పటికీ వివాదస్పద ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవడం ద్వారా తన ప్రాధాన్యతను తెలియచేస్తోంది. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలే తనకు ముఖ్యమని తెలియజేస్తుా ముందుకు సాగుతోంది. ఈ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా 2018 నాటి పాలన ఉత్తర్వులను సవరించాలంటుా ఏప్రిల్ 30 న దేశ అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఎన్నకల నిరుాపణకు వీలుగా గిల్గిత్-బాల్టిస్ధాన్ లో ఆపధ్ధర్మప్రభుత్వ ఏర్పాటుకు దేశాధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ ఉత్తర్వులు జారీ చేశారు.

అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా…..

పాక్ నిర్ణయాల పట్ల భారత్ తీవ్రనిరసన వ్యక్తం చేసింది. వివాదాస్పద గిల్గిత్-బాల్టిస్ధాన్ లో ఎన్నికలు నిర్వహించే హక్కు పాక్ కు లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. గిల్గిత్-బాల్టిస్ధాన్ అవిభక్త జమ్ముకాశ్మీర్ లో భాగమని, దానిపై ఎలాంటి హక్కులేదని పేర్కొంది. ఈ మేరకు 1994 లో నాటి పి.వి.సర్కార్ పార్లమెంట్ లో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అవిభక్త కాశ్మీర్ లోని ఆ ప్రాంతాన్ని పాక్ అక్రమంగా ఆక్రమించుకుందని, అందువల్ల ఇప్పటికీ అది వివాదాస్పద ప్రాంతమేనని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికే భారత్ అభ్యంతరాలను భేఖాతరు చేస్తుా ముందుకెళ్ళడం దాయాది దేశం పాక్ కి కొత్తకాదు. ఇప్పుడు జరుగుతుంది అదే.

ముస్లిం లీగ్ గతంలో గెలిచి….

2015 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో పాకిస్ధాన్ ముస్లింలీగ్ విజయం సాధించింది. అప్పట్లో ఆ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ దేశాన్ని ఏలుతున్నారు. గిల్గిత్-బాల్టిస్ధాన్ అసెంబ్లీ లో మెుత్తం 33 స్ధానాలు ఉన్నాయి. వీటిలో 24 స్ధానాలను మహిళలకు రిజర్వు చేస్తారు. మిగిలిన 3 స్ధానాలను టెక్నోక్రాట్స్ కు కేటాయిస్తారు. అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది జుాన్ 24 తో ముగుస్తుంది. అప్పటి నుంచి 90 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగించాల్సి ఉంటుంది. అయిదేళ్ళ క్రితం 2015 డిసెంబరు ఎన్నికల్లో పాకిస్ధాన్ ముస్లింలీగ్ పార్టీ 22 స్ధానాలు సాధించింది. 33.78 శాతం ఓట్లను కైవసం చేసుకుంది.

పోటీలో మూడు ప్రధాన పార్టీలు….

ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్ధాన్ తెహ్రిన్ ఇన్సాఫ్ పార్టీ ఒక స్ధానాన్ని, 10.99 శాతం ఓట్లను చేజిక్కించుకుంది. అప్పట్లో పి.ఎం.సి తరపున హఫిజ్ షఫీజుల్ రెహమాన్ ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ సారధ్యంలోని ఆల్ పాకిస్ధాన్ ముస్లింలీగ్ ఒక్క స్ధానాన్ని గెలుచుకోలేక పోయింది. ప్రస్తుత ఎన్నకల్లో ముాడు ప్రధాన పార్టీలు పోటీ పడనున్నాయి. ప్రధాని ఇమార్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్ధాన్ తెహ్రిక్ ఇన్సాఫ్, మాజీ సి.ఎం నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్ధాన్ ముస్లింలీగ్, బిలావల్ భుట్టో సారధ్యంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ బరిలోకి దిగనున్నాయి. ఇమ్రాన్ పార్టీ ఇప్పటికే పంజాబ్, ఖైబర్ ఫంక్తుాన్ క్వా ప్రావిన్స ల్లో అధికారం ఉంది.

ఇమ్రాన్ పార్టీకే అవకాశం….

దేశంలో పంజాబ్ అతిపెద్ద, సంపన్న ప్రావిన్స్. కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ గిల్గిత్-బాల్టిస్ధాన్ అధికార పీఠాన్ని అందుకునే అవకాశం కనపడుతోంది. అవినీతి ఆరోపణలతో జైలు పాలైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ నాయకత్వలేమి సమస్యను ఎదుర్కొంటోంది. దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడైన బిలావత్ భుట్టో సారధ్యంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ పరిస్ధితి కుాడా చెప్పుకోదగ్గ స్ధాయిలో లేదు. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ పార్టీ గిల్గిత్-బాల్టిస్ధాన్ పేఠాన్ని కైవశం చేసుకునే అవకాశం కనపడుతోంది. స‍హజంగా ఇస్లామాబాద్ లో చక్రం తిప్పే పార్టీయే ఇక్కడ కూడా పాగా వేస్తుంది. సైనిక బలగాల కనుసన్నల్లో జరిగే ఏకపక్ష ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు అసహజం ఏమీ కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News