పళనిస్వామి పంచ్ తో ఆగిపోతాయా?
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీని కట్టడి చేేసే పనిలో ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇతర పార్టీల వైపు మొగ్గుచూపే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా [more]
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీని కట్టడి చేేసే పనిలో ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇతర పార్టీల వైపు మొగ్గుచూపే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా [more]
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీని కట్టడి చేేసే పనిలో ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇతర పార్టీల వైపు మొగ్గుచూపే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా మంత్రిగా ఉన్న వారు సయితం పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోకుంటే ఇక పార్టీ వచ్చే ఎన్నికల్లో మనుగడ కష్టమని, నాయకత్వంపై నమ్మకం పూర్తిగా పోతుందని భావించిన పళని స్వామి యాక్షన్ లోకి దిగారు.
మంత్రి వర్గం నుంచి…..
పళనిస్వామి మంత్రివర్గంలో ఉన్న రాజేంద్ర బాలాజీని ఇప్పటికే జిల్లా కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. రాజేంద్ర బాలాజీ విరుద నగర్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఆయన రజనీకాంత్ పార్టీలో చేరతారన్న సంకేతాలు రావడంతో ఆయనను కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామి తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా నిర్ణయించారు. ఇదే బాటలో ఎవరైనా వెళితే చర్యలు తప్పవన్న హెచ్చరికలు పార్టీ నేతలకు పంపాలని పళనిస్వామి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
వివాదాల్లో చిక్కుకోవడంతో….
రాజేంద్ర బాలాజీ గత కొద్దిరోజుల నుంచి వివాదంలో చిక్కుకుంటున్నారు. బీజేపీతో జట్టు కట్టిన నాటి నుంచి రాజేంద్ర బాలాజీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయంలోనూ ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్లు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి స్వయంగా హెచ్చరించినా రాజేంద్ర బాలాజీలో మార్పు రాకపోవడంతో ఆయనను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. రాజేంద్ర బాలాజీ కూడా రజనీకాంత్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటున్నారు.
మరికొందరు కూడా….
రాజేంద్ర బాలాజీ తరహాలోనే మరో ఇద్దరు మంత్రులు కూడా అదే బాటలో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు కూడా రజనీకాంత్ పార్టీ వైపు చూస్తున్నట్లు పళనిస్వామికి ఇంటలిజెన్స్ నివేదిక అందడంతో ఆయన అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమై వారితో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం పార్టీ నేతలు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.