పళనిస్వామికి ప్రమాదం ఇంటి నుంచేనా?

ఇప్పటి వరకూ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. చరిష్మా లేకపోయినా పదవితో నెట్టుకొచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు పళనిస్వామి ప్రతిపక్ష స్థానానికే పరిమితమయ్యారు. [more]

Update: 2021-05-05 18:29 GMT

ఇప్పటి వరకూ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. చరిష్మా లేకపోయినా పదవితో నెట్టుకొచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు పళనిస్వామి ప్రతిపక్ష స్థానానికే పరిమితమయ్యారు. అధికారం పోవడంతో ఆయన మాట చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్నది సందేహంగానే మారనుంది. ఎమ్మెల్యేలు కట్టడిగా ఉంటారా? అన్నది కూడా తమిళనాట అన్నాడీఎంకేలో చర్చనీయాంశమైంది.

గౌరవప్రదమైన స్థానాలను…

జయలలిత వంటి ఇమేజ్ లేకపోయినా పళనిస్వామి తన పాలనతో అన్నాడీఎంకేకు గౌరవప్రదమైన స్థానాలను సంపాదించిపెట్టారు. వన్ సైడ్ విజయాన్ని స్టాలిన్ కు కట్టబెట్టలేదు. అన్నాడీఎంకే 65 స్థానాల్లో విజయం సాధించింది. మిత్ర పక్షాలతో కలసి 75 స్థానాలు ఈ కూటమికి దక్కాయంటే సామాన్యవిషయమేమీ కాదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇమేజ్ ఉన్న చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో దక్కింది కేవలం 23 స్థానాలు మాత్రమే. చంద్రబాబుతో పోల్చుకుంటే పళనిస్వామి ఎన్నో రెట్లు మేలు.

ఎన్నాళ్లు ఉంటుంది?

అయితే పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం ఎన్నాళ్లు ఉంటుందనదే ప్రశ్న. ఇప్పటికే శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు కాచుక్కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలా మంది శశికళకు సన్నిహితంగా ఉన్నవారే. డీఎంకే ఎటువంటి ఆకర్ష్ లకు పాల్పడదు. తమిళనాడులో అలాంటి సంస్కృతి ఇప్పటి వరకూ లేదు. ఇతర పార్టీల వారిని చేర్చుకుని బలహీన పడే ప్రయత్నాన్ని తంబిలు చేయరు. ఇది కొంత ఊరటనిచ్చే అంశమయినా పళనిస్వామికి శశికళ నుంచే ప్రమాదముందన్న వార్తలు వస్తున్నాయి.

పన్నీర్ సెల్వం వైపు…?

మరోవైపు పన్నీర్ సెల్వం సయితం అసంతృప్తిగానే ఉన్నారు. బీజేపీ ఇప్పటి వరకూ కంట్రోల్ చేయడంతో పన్నీర్ సెల్వం కొంత తగ్గి ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో కూడా పెద్దగా పనిలేదు. ఆయన కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల్లో చేరకుండా చూసుకోవడమే పళనిస్వామి ముందున్న లక్ష్యం. మరి ఆయన ముందు ముందు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనేది చూడాలి. ఈ నెల 7 వతేదీన అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత ఎన్నిక జరగనుంది. ఇందులో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News