పనబాక పోటీకి దిగుతారా?
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ [more]
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ [more]
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ లో ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరణించిన బల్లి దుర్గాప్రసాదరావుకు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులకు సీటు ఇస్తే టీడీపీ పోటీ చేసే అవకాశముండదు.
వేరే వారిని ఎంపిక చేస్తేనే….
అదే సమయంలో వేరే వారిని వైసీపీ ఎంపీక చేస్తే ఖచ్చితంగా టీడీపీ బరిలోకి దింపుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకు పనబాక లక్ష్మిని మరోసారి పోటీకి నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పనబాక లక్ష్మితో చంద్రబాబు దీనిపై ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే పనబాక లక్ష్మి పోటీకి ఆసక్తి చూపడం లేదని సమాచారం. సానుభూతి ఉండటంతో పాటు వైసీపీకి ఏడు నియోజకవర్గాల్లో పట్టు ఉండటమే పనబాక లక్ష్మి అనాసక్తికి కారణమంటున్నారు.
ఆమె అనాసక్తి…..
పనబాక లక్ష్మి 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి పనబాక లక్ష్మి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ, చంద్రబాబు నిర్వహించే వీడియో కార్ఫరెన్స్ లలో కూడా ఆమె పాల్గొనడం లేదు. ప్రస్తుత రాజకీయాల పట్ల పనబాక లక్ష్మి అనాసక్తగా ఉన్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
మరో ఆప్షన్ కూడా…..
అయితే పనబాక లక్ష్మిని మరోసారి పోటీ చేయించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. లేకుంటే మాజీ ఎంపీ, దివంగత శివప్రసాద్ కుటుంబం నుంచి ఒకరిని బరిలోకి దింపాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఫైనల్ నిర్ణయాన్ని చంద్రబాబు పనబాక లక్ష్మికే వదిలేశారు. అయితే వైసీపీ దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా బరిలోకి దిగే ఛాన్స్ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పనబాక లక్ష్మి పోటీకి మొగ్గు చూపుతారా? లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది.