పనబాక పలాయనం ఖాయమా… ?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పెద్దలు తమకు తోచిన భాష్యాలు చెప్పుకున్నారు. అధినేత చంద్రబాబు అయితే కింద పడ్డా పైచేయి తనదే [more]

Update: 2021-05-22 03:30 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పెద్దలు తమకు తోచిన భాష్యాలు చెప్పుకున్నారు. అధినేత చంద్రబాబు అయితే కింద పడ్డా పైచేయి తనదే అని కూడా అన్నారు. కానీ అసలు బాధ ఎవరిదీ అంటే ఆ ఎన్నికల్లో వద్దు వద్దంటూ పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిదే. ఆమెకు ఉన్నపాటి ఇమేజ్ కూడా దెబ్బతినేలా టీడీపీ అధినాయకత్వం ఎన్నికల్లో దించి మరీ ఓడించింది అని అనుచరులు వగచి వాపోతున్నారుట. పనబాక లక్ష్మికి గతసారి వచ్చిన ఓట్లు కూడా ఈసారి రాలేదు. అయితే వైసీపీకి టార్గెట్ గా పెట్టుకున్న మెజారిటీ తగ్గిందని తనను తాను మభ్యపెట్టుకుంటూ టీడీపీ పెద్దలు తమ్ముళ్లను మత్తులో ఉంచుతున్నారు.

పీక్స్ లో అసంతృప్తి….

పనబాక లక్ష్మి ఓటమి తరువాత అసలు మాట్లాడడం లేదు. ఆమె సొంత పార్టీ నేతల తీరు మీదనే గుర్రు మీద ఉన్నారని టాక్. తిరుపతిలో మొత్తానికి మొత్తం రాష్ట్ర పార్టీ దిగిందని, తనకు గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి అని ఆమె భ్రమించారు కానీ అది చినబాబు లోకేష్ ఫోకస్ కోసమని తాపీగా తెలుసుకుని చింతిస్తున్నారని టాక్. పైగా వరస ఎన్నికల్లో అపజయం పాలు అయిన టీడీపీకి ఆ మాత్రం ఓట్లు రాకపోతే చిక్కులు తప్పవని మొత్తం మోహరించారని అర్ధం చేసుకున్నతరువాత పనబాక లక్ష్మి మండుతున్నారుట. అంటే కేంద్ర మాజీ మంత్రిగా తన ఇమేజ్ కి పార్టీ వాడుకుంది కానీ పార్టీ తనకు ఏ విధంగా హెల్ప్ కాలేదన్నదే ఆమె ఆవేదన అని అంటున్నారు.

జెండా పీకేయడమే….?

ఇక పనబాక లక్ష్మి విషయంలో టీడీపీ పెద్దలకు కూడా ఆశలు ఏవీ లేవు. ఎందుకంటే ఆమె పోటీ చేయను అంటూనే బతిమాలించుకుని బరిలోకి దిగారు. దాంతో ఓడాక ఆమె టీడీపీలో ఉంటారు అంటే ఆ పార్టీ పెద్దలకే నమ్మకం లేదు అన్న మాట వినిపిస్తోంది. అచ్చం అలాగే పనబాక లక్ష్మి వర్గంలోనూ ఆలోచనలు సాగుతున్నాయట. టీడీపీలో ఉండకూడదు అన్నది దాదాపుగా డిసైడ్ అయినట్లుగా టాక్. అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్నదే సమాలోచనలు చేస్తున్నారుట. వైసీపీలోకా బీజేపీలోకా అన్నదే ఇపుడు పనబాక లక్ష్మి వర్గంలో ప్రశ్నగా ఉందిట.

ఓకే చెబుతారా…?

గతంలో వైసీపీలోకే పనబాక లక్ష్మిని ఆ పార్టీ పెద్దలు పిలిచారు. కానీ ఆమె టీడీపీలో చేరి పోటీ చేశారు. దాంతో మళ్ళీ అక్కడ అవకాశం ఉంటుందా అన్నది కూడా ఆలోచిస్తున్నారుట. ఒకవేళ జగన్ ఓకే అంటే పనబాక లక్ష్మి వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే ఎస్సీలలో బలమైన నేతగా ఉన్న పనబాకను తీసుకుని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు అయినా ఇచ్చేందుకు జగన్ రెడీ అన్న టాక్ కూడా ఉంది. దాంతో ఆమె వైసీపీలో చేరిపోతారు అనే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఒక వేళ అక్కడ కుదరదు అనుకుంటే బీజేపీలో చేరుతారు అని కూడా అంటున్నారు. మొత్తానికి సైకిల్ దిగిపోయే వారి జాబితాలో పనబాక లక్ష్మి పేరు ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటుందిట.

Tags:    

Similar News