Panabaka : మరోసారి ఓటమికి సిద్ధంగా లేరా?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు జరిగి నెలలు కూడా గడవ లేదు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల [more]

Update: 2021-10-15 05:00 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు జరిగి నెలలు కూడా గడవ లేదు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఆమె పార్టీకి దూరమెందుకయ్యారన్న చర్చ జరుగుతోంది. టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని అంచనా వేసుకున్న పనబాక లక్ష్మి కావాలనే పార్టీకి దూరం అయ్యారా? లేక ఎన్నికలకు ముందు యాక్టివ్ అవ్వాలని యోచిస్తున్నారా? అన్నది తేలకుండా ఉంది.

రెండుసార్లు ఓడి…

పనబాక లక్ష్మి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వరసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పనబాక లక్ష్మి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమె సైలెంట్ అయ్యారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఉప ఎన్నిక రావడంతో తిరిగి పనబాక లక్ష్మిని టీడీపీ తిరిగి అభ్యర్థిగా ప్రకటించింది.

స్థానిక నేతలపై….

ఎన్నికలకు కొన్ని నెలలు ముందు అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఆమె ప్రజల వద్దకు రాలేదు. ఇది అప్పట్లో చర్చనీయాంశ మైంది. మరోసారి ఉప ఎన్నిక్లలో ఓటమిపాలయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు తన గెలుపునకు కృషి చేయలేదని ఎన్నికల తర్వాత పనబాక లక్ష్మి టీడీపీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. అంటే స్థానిక నాయకత్వంపైన పనబాక లక్ష్మి తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

టీడీపీకి అనుకూలంగా లేని….

దీంతో పాటు తిరుపతి నియోజకవర్గం తనకు సేఫ్ కాదని పనబాక లక్ష్మి భావిస్తున్నారు. టీడీపీలో తిరుపతి తప్ప తనకు మరోస్థానం కేటాయించే అవకాశం లేదు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలహీనంగా ఉంది. ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానం తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకునే పరిస్థిితి లేదు. మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యే కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అని ఆమె ఆలోచనలో పడ్డారు. అందుకే పార్టీ కి దూరంగా ఉంటున్నారంటున్నారు.

Tags:    

Similar News