పన్నీర్ ఆశలు నెరవేరేనా?
పన్నీర్ సెల్వం అనుకున్నది సాధించేటట్లే ఉంది. పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయి సంతృప్తిగా లేరు. ముఖ్యమంత్రి పళనిస్వామి తనకు సరైన రీతిలో [more]
పన్నీర్ సెల్వం అనుకున్నది సాధించేటట్లే ఉంది. పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయి సంతృప్తిగా లేరు. ముఖ్యమంత్రి పళనిస్వామి తనకు సరైన రీతిలో [more]
పన్నీర్ సెల్వం అనుకున్నది సాధించేటట్లే ఉంది. పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయి సంతృప్తిగా లేరు. ముఖ్యమంత్రి పళనిస్వామి తనకు సరైన రీతిలో గౌరవం ఇవ్వడం లేదని, ముఖ్య విషయాల్లోనూ తనను సంప్రదించడం లేదన్న అసంతృప్తితో పన్నీర్ సెల్వం ఉన్నారు. ఇక వేరే దారిలేక, బయటకు రాలేక పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేలోనే కాలం వెళ్లదీస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆయన వేచి చూస్తున్నారు.
బీజేపీ పెద్దలతో…..
అమ్మ జయలలిత జీవించి ఉన్నప్పుడు తనకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పదే పదే పన్నీర్ సెల్వం గుర్తు చేస్తున్నారు. జయలలిత మరణం తర్వాత తనను పక్కన పెట్టారని తరచూ తన సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత పళనిస్వామికి తిరిగి దగ్గర చేసింది బీజేపీ పెద్దలే. తొలినుంచి బీజేపీతో పన్నీర్ సెల్వంకు సత్సంబంధాలున్నాయి.
కుమారుడికి మంత్రి పదవి కోసం….
ీదీంతో ఆయన గత రెండేళ్ల నుంచి బీజేపీ తో మంచి మిత్రుడిగా మెలుగుతున్నారు. పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాధ్ ను కేంద్ర మంత్రిగా చేయాలన్నది పన్నీర్ సెల్వం కోరిక. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలోనే తనకుమారుడికి కేంద్ర మంత్రిగా పదవి దక్కుతుందని భావించారు. అప్పుడు కూడా పన్నీర్ సెల్వం అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. దీనిపై కూడా పన్నీర్ సెల్వం పళనిస్వామి పట్ల ఆగ్రహంతో ఉన్నారు.
ఈసారైనా దక్కేనా?
మరి కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా తన కుమారుడికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన కేంద్రంలోని పెద్దలతో టచ్ లో ఉన్నారు. రవీంద్రనాధ్ అనేక బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ పార్లమెంటు లో ప్రసగించారు. ప్రతి దానికి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈసారైనా పళనిస్వామి తన కుమారుడికి మంత్రి పదవి దక్కకకుండా అడ్డుకుంటారేమోనన్న అనుమానం లేకపోలేదు. అందుకే జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఈసారైనా పన్నీర్ సెల్వం ఆశలు ఫలిస్తాయో లేదో? చూడాలి.