తంబిలు తన్నుకుంటున్నారు.. ఎన్నికల వేళ..?

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా పన్నీర్ సెల్వం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలసిన పోస్టర్లు ఇద్దరి [more]

Update: 2020-08-20 18:29 GMT

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా పన్నీర్ సెల్వం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలసిన పోస్టర్లు ఇద్దరి మధ్య మరింత అగాధాన్ని సృష్టించాయంటున్నారు. దీంతో మరోసారి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బయటకు ఎంత చెబుతున్నా వారి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పన్నీర్ అనుమానం ఇదే….

ఇందుకు ప్రధాన కారణం శశికళ. శశికళ జైలు నుంచి విడుదల అయిన వెంటనే అన్నాడీఎంకే ను ఆమెకు అప్పగించేందుకు పళనిస్వామి సిద్దమయ్యారన్నది పన్నీర్ సెల్వం అనుమానం. అందుకే ఆయన ఇటీవల కాలంలో కొంత దూరం పాటిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు తాను ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ప్రధాన అనుచరులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం మాత్రం పళనిస్వామి పోకడల పట్ల విసుగెత్తి పోయారని చెబుతున్నారు.

మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని…..

నిజానికి మూడేళ్ల నుంచి ఇద్దరు కలసి పనిచేయడం అనూహ్యమే. జయలలిత లేని పార్టీని అధికారంలో ఉంచడం పళనిస్వామికి కత్తిమీద సామే. పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడే ఎంతకాలమో ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదని అందరూ భావించారు. అయితే పన్నీర్ సెల్వం సహకారంతో దాదాపు మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచగలిగారు. ఇందుకు ఇద్దరి పరస్పర సహకారంతో పాటు పార్టీ శ్రేణులు కూడా కష్టపడి పనిచేయడమే.

ఎన్నికల సమయంలో…..

లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన తరుణంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామిలో కంగారు మొదలయింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం 9 స్థానాలను దక్కించుకుని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోగలిగింది. అయితే పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలను కూడా తనవైపునకు పళనిస్వామి తిప్పుకున్నారు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో పన్నీర్ సెల్వం పాత్రను పళనిస్వామి తగ్గించగలిగారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయంటున్నారు. ఎన్నికల వేళ టిక్కెట్ల కేటాయింపు సమయంలో మరెంత రచ్చ జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News