పరాశరన్.. అయోధ్యకు సింబల్

అయోధ్య శ్రీరాముడి జన్మస్దలంగా సుపరిచితం. ఆధ్యాత్మిక భావాలుగల కొంతమందికి ఈవిషయం తెలుసు. మిగతా ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఎనిమిదో దశకంలో నాటి భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు ఎల్.కె.అద్వానీ [more]

Update: 2020-03-03 16:30 GMT

అయోధ్య శ్రీరాముడి జన్మస్దలంగా సుపరిచితం. ఆధ్యాత్మిక భావాలుగల కొంతమందికి ఈవిషయం తెలుసు. మిగతా ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఎనిమిదో దశకంలో నాటి భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు ఎల్.కె.అద్వానీ చేపట్టిన రధయాత్రతో అయోధ్య అంశం ఒక్కసారిగా ప్రజల్లోకి వెళ్లింది. అప్పటి నుండి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ విషయం ప్రజల్లో నలుగుతోంది. విస్త్రతంగా చర్చనీయాంశమైంది. మందిర్, మసీదు అంశం వివాదంగా మారింది. మధ్యవర్తుల చర్చలు వి‌ఫలమయ్యాయి. చివరికి వివాదం సర్వోన్నత న్యాయస్దానానికి చేరింది. సుదీర్ఘ వాదనల అనంతరం గతఏడాది నవంబరులో తీర్పు వచ్చింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని విస్త్రత ధర్మాసనం శ్రీరాముడి జన్మస్థలి అయెాధ్యే నని విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాంతో దశాభ్దాల వివాదానికి తెరపడింది. ఎక్కడా ఎలాంటి నిరసనలు కుాడా వ్యక్తం కాలేదు.

మూడున్నరేళ్లలో పూర్తికి…..

న్యాయపరమైనఅడ్డంకులు తొలగిపోవడంతో మందిరని ర్మాణపనులు ఊపందుకున్నాయి. రామజన్మభుామి ఉధ్యమంలో కీలక పాత్ర పోషించిన మహంత నృత్య గోపాల్ దాస్ రామమందిర్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ ట్రస్ట్ ఆలయనిర్మాణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యక్షుడిగా ప్రధాని మెాదీ, మాజీ ముఖ్య కార్యదరి నృపేంద్ర మిశ్రాను ట్రస్టు సభ్యులు ఎన్నుకున్నారు. కోశాధికారిగా పుాణెకు చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరి నియమితులయ్యారు. ముాడున్నరేళ్లలో ఆలయనిర్మాణం పుార్తిచేయాలని నిర్నయించారు. ప్రజల నుండి ఇటుకలు, ఆర్థిక సహాయన్ని కుాడా తీసుకుంటారు. అక్షరధామ్, సర్దార్ పటేల్ విగ్రహం తరహాలో ఆలయ నిర్మాణాన్ని ముాడున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. రామమందిర నిర్మాణ పర్యవేక్షణకోసం కేంద్రం ఏర్నాటు చేసిన శ్రీరామ జన్మభుామి క్షేత్ర ట్రస్ట్ తొలి సమావేశం ఇటీవల జరిగింది. సుప్రీంకోర్టు సివిల్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ఎ.కె.పరాశరన్ నివాసంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆలయ నిర్మాణానికి విరాళాల కోసం అయెాధ్యలో ఎస్ఐబీ శాఖలో కొత్తగా బ్రాంచ్ ను ప్రారంభించనున్నారు.

న్యాయపరంగా ఆయన…..

మందిర్ వివాదంలో న్యాయపరంగా పరాశరన్ పోషించిన పాత్ర అత్యంతకీలకం. తమిళనాడుకు చెందిన పరాశరన్ పరమ రామభక్తుడు. 92 ఏళ్ల వయస్సులోనుా ఈ వివాదానికి సంభందించి సుప్రీంకోర్టుకు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అవసరమైన సాక్ష్యా ధారాల సేకరణలో చురుగ్గా వ్యవహరించారు. తన తెలివితేటలు, న్యాయ పరిజ్ఞానంతో ప్రత్యర్దుల వాదనలను తుత్తునియలు చేశారు. తన జుానియర్లకు ఎప్పటికప్పడు మార్గదర్సనం చేశారు. రామజన్మభుామి ట్రస్ట్ కు తన నివాసాన్ని చిరునామాగా మర్చారు. కేంద్రం విడుదల చేసిన నాటిపిటీషన్ లో కుాడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. శ్రీ రామజన్మభుామి తీర్దక్షేత్రం ట్రస్ట్, R 20 , గ్రేటర్ కైలాశ్, పార్ట్-1, దిల్లి 110048 చిరునామాగా రిజిస్టర్ చేయించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెబ్ సైట్లో కూడా ఇదే చిరునామా ఉండటం విశేషం.

సుదీర్ఘ ప్రస్థానం…..

పరాశరన్ ది సుదీర్ఘప్రస్దానం. 1958లో ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. అత్యవసర పరిస్దితి (1975) సమయంలో తమిళనాడు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 1980 లో భారత సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. 1983 లో ఇందిరాగాంధీ హయాంలో అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ హయాం వరకు అంటే 1989 వరకు అటార్నీ జనరల్ గా వ్యవహరించారు. వాజ్ పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పద్మభుాషణ్ అవార్డుతో పరాశరన్ ను సత్కరించింది. యుపీఏ పౌర పురస్కారమైన పద్మవిభుాషణ్ తో సత్కరించింది. అంతేకాక నిష్ణాతుల కోవలో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరుా ఆయనను గ‌ౌరవించేవారు. అభిమానించే వారు. ఆయన విద్వత్తును గుర్తించేవారు. సుప్రీంకోర్టు న్యాయముార్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పరాశరన్ ను భారత బార్ పితామహుడిగా అభివర్లించారు. ఇంతకు మించిన మరోగౌరవం ఉండదు. తాను బతికుండగానే రామాలయ నిర్మాణం చుాడాలన్నది పరాశరన్ ఆకాంక్ష. ఇదినెరవేరాలని ఆశిధ్దాం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News