అక్కడ పరిటాల కన్ను.. రీజన్ ఇదేనా…!
పరిటాల శ్రీరాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా వినిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి శ్రీరాం [more]
పరిటాల శ్రీరాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా వినిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి శ్రీరాం [more]
పరిటాల శ్రీరాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా వినిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి శ్రీరాం పోటీ చేశారు. ఆయన గెలుపు సునాయాసమేనని, మెజారిటీపైనే అంచనాలు ఉన్నాయని వినిపించింది. ఈ క్రమంలోనే కోట్లకు కోట్లు శ్రీరాం మెజారిటీపై పందేలు కాశారు. అయితే, అను కున్నది ఒక్కటి, జరిగింది మరొక్కటి.. అన్నట్టుగా ఇక్కడ వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి దాదాపు 27 వేల ఓట్ల మెజారిటీ పైనే తెచ్చుకుని విజయం సాధించారు. దీంతో పరిటాల శ్రీరాం రాజకీయ ఎంట్రీ… ఓటమిని చవిచూసింది. నిజానికి ఈ నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీకి కొత్తకాదు.
అచ్చి వచ్చిన నియోజకవర్గమైనా….
ఇక్కడ నుంచి పరిటాల రవి సతీమణి, సునీత 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలోనే తన కుమారుడు పరిటాల శ్రీరాంను రాజకీయ వారసుడిగా గెలిపించుకుని, దివంగత పరిటాల రవికి కానుకగా ఇవ్వాలని ఆమె భావించారు. ప్రచారాన్ని కూడా చాలా ఉద్రుతంగానే నిర్వహించారు. రేయింబవళ్లు కుమారుడి కోసం శ్రమించారు. అయినా కూడా ప్రజలు పరిటాల శ్రీరాం ను పక్కన పెట్టారు. దీంతో ఆయనకు ఇప్పుడు రాప్తాడులో మొహం చూపించాలంటేనే కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మారిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం.
సూరి వెళ్లిపోవడంతో…..
అనంతపురంలోని మరో కీలకమైన, టీడీపీకి కంచుకోటగా ఉన్ననియోజకవర్గం ధర్మవరం. ఇక్కడ కూడా పరిటాల రవి జీవించి ఉన్న సమయంలో ఆయన హవా బాగా సాగింది. ఇక్కడ పరిటాల ఫ్యామిలీకి భారీ ఎత్తున అనుచర వర్గం కూడా ఉంది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పరిటాల శ్రీరాం ఇప్పుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతు న్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ ఉరఫ్ వరదాపురం సూరి.. ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన టీడీపీకి రాం రాం చెప్పి.. ఇటీవలే జాతీయ పార్టీ బీజేపీలో చేరిపోయారు. దీంతో ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ పీఠం ఖాళీ అయింది.
బంధువులు, అనుచరులు ఎక్కువగా….
దీనిని దృష్టిలో పెట్టుకున్న పరిటాల శ్రీరాం.. ధర్మవరం ఇంచార్జ్ పీఠం తనకు దక్కితే.. వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించవచ్చని భావిస్తున్నారట. తన తండ్రి తాలూకు బంధువులు, అనుచరులు భారీ ఎత్తున ఇక్కడ ఉండడంతో తనకు కలిసి వస్తుందని అనుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును ధర్మ వరం ఇంచార్జ్ పీఠం తనకు అప్పగించాలని ఆయన వేడుకొన్నట్టు చెబుతున్నారు. మంగళవారం ధర్మవరంలో పర్యటించిన చంద్రబాబు కూడా పరిటాల ఫ్యామిలీకే ధర్మవరం బాధ్యతలు కూడా అప్పగిస్తున్నట్టు చెప్పారు. శ్రీరాం ఆశలు చంద్రబాబు వద్ద నెరవేరినా.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో అయినా ఆయనను ఏమేరకు ఆశీర్వదిస్తారో ? అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయో ? చూడాలి.