పరిటాలకు పట్టు ఉన్నా.. అటు వైపే మొగ్గు

ఇప్పడిప్పుడే అందరూ మానసికంగా కుదురుకుంటున్నారు. ఓటమి నుంచి బయటకు వస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అందులో పరిటాల శ్రీరామ్ ఒకరు. గత ఎన్నికల్లో రాప్తాడు [more]

Update: 2021-01-31 14:30 GMT

ఇప్పడిప్పుడే అందరూ మానసికంగా కుదురుకుంటున్నారు. ఓటమి నుంచి బయటకు వస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అందులో పరిటాల శ్రీరామ్ ఒకరు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన పరిటాల శ్రీరామ్ ఈసారి ఖచ్చితంగా గెలుపు తనదేనన్న ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయాలనుకున్నా ఆ అవకాశాన్ని పరిటాల శ్రీరామ్ తీసుకున్నారు. జగన్ హవాలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు.

ధర్మవరం బాధ్యతలను…..

వాస్తవానికి పరిటాల కుటుంబం రెండు టిక్కెట్లు ఆశించినా టీడీపీ అధినేత చంద్రబాబు కుదరదు పొమ్మన్నారు. అందుకే రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. అయితే అనంతపురంలో హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు తప్పించి ఎక్కడా టీడీపీ గెలవలేదు. ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత పరిటాల కుటుంబానికి ధర్మవరం బాధ్యతలను కూడా చూసుకోవాలని చెప్పారు.

పట్టున్నప్పటికీ…..

నిజానికి ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ కు పట్టుంది. పరిటాల రవి అనుచరులు, బంధువులు ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ దృష్టి పెడతారని టీడీపీ అధినేత చంద్రబాబు సయితం భావించారు. కానీ పరిటాల శ్రీరామ్ రాప్తాడు వైపే మొగ్గు చూపుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

సూరి రావడం ఖాయమట….

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదంటున్నారు. ధర్మవరంలో కరడు గట్టిన టీడీపీ నేతగా ఉన్న వరదాపురం సూరి తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. తనపై ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికే తాత్కాలికంగా సూరి బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి వస్తారని, చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని భావించి పరిటాల శ్రీరామ్ రాప్తాడుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ధర్మవరం ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించినా ఆయన పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News