సీట్లు పెంచక తప్పదా?

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రత్యేకతలు భారత్ సొంతం. వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. మొదటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్న జాతులు, మతాలు, వర్గాలు, కులాలు [more]

Update: 2020-02-14 16:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రత్యేకతలు భారత్ సొంతం. వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. మొదటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్న జాతులు, మతాలు, వర్గాలు, కులాలు కలసి మెలిసి జీవిస్తున్నాయి. క్రమం తప్పకుండా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి ప్రశాంతంగా జరుగుతుంది. అధికార గర్వంతో విర్రవీగిన ఏ ఒక్క నాయకుడినీ ప్రజలు ఎన్నికల్లో శిక్షిస్తున్నారు. నాయకుల పరిమితులను గుర్తు చేస్తున్నారు. అత్యధిక జనాభాగల రెండో దేశం కావడం మరో ప్రత్యేకత. పొరుగున ఉన్న చైనా తర్వాత అత్యధిక జనాభాతో విలసిల్లుతున్న దేశం. వందకోట్లకు పైగా ఉన్న జనాభాతో ముందుకు సాగుతోంది. మున్ముందు చైనాను దాటి అత్యధిక జనాభాగల దేశంగా గుర్తింపు పొందనుంది.

పెరుగుతున్న జనాభాకు….

అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయా? ఆ యా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు ప్రజల మౌలిక సౌకర్యాలు తీర్చగలుగుతున్నారా? ఈ ప్రాంతంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? ఒకే ఒక్క ప్రజాప్రతినిధి లక్షల సంఖ్యలో ఉండే ప్రజల అవసరాలు తీర్చగలరా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే వీటికి సంతృప్తికరమైన సమాధానం దొరకడం కష్టమే. నియోజకవర్గాలు ముఖ్యంగా లోక్ సభ నియోజకవర్గాలను పెంచడం ద్వారా ఈ సమస్యకు కొంతవరకూ పరిష్కారం కనుగొనవచ్చని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటవల జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ లోక్ సభ స్థానాల పెంపు గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో నియోజకవర్గాలను కూడా పెంచక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం వెయ్యి లోక్ సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.

43 ఏళ్ల క్రితం లెక్కలే…

రాష్ట్రాలను పక్కన పెడితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 54 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన, 1977 లో లోక్ సభ స్థానాలను నిర్ణయించారు. అప్పట్లో దేశ జనాభా కేవలం 54 కోట్లే. ప్రస్తుతం జనాభా 130 కోట్లకు పెరిగింది. 43 ఏళ్లలో జనాభా పట్టపగ్గాలు లేకుండా పెరిగింది. కానీ ఆ స్థాయిలో లోక్ సభ నియోజకవర్గాలు పెరగలేదు. అంటే సగటున ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో ఆయా ప్రాంతాలను బట్టి పది నుంచి 15 లక్షల ఓటర్లున్నారు. ఒక ఎంపీ ఇంతమంది ప్రజల బాగోగులను చూసుకోగలరా అన్న ప్రశ్నకు సమాధానం లభించడం కష్టమే. నియోజకవర్గాలను పెంచడమే ఇందుకు పరిష్కారమన్న వాదన విన్పిస్తోంది.

ఇతర దేశాల్లో……

మనకన్నా జనాభా పరంగా చిన్న దేశాల్లో ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. ఒకప్పుడు మనదేశాన్ని పాలించిన బ్రిటన్ ప్రస్తుత జనాభా ఆరు కోట్లే. కానీ అక్కడి చట్ట సభలో 650 మంది సభ్యులున్నారు. దేశంలోని ఒక్క ఇంగ్లండ్ ప్రావిన్స్ లోనే 500కు పైగా స్థానాలున్నాయి. 30 కోట్లకు పైగా జనాభా గల అగ్రరాజ్యమైన అమెరికా కాంగ్రెస్ లో సభ్యుల సంఖ్య 535. ఎంతో చిన్న దేశమైన కెనడాలో 443 మంది లోక్ సభ సభ్యులున్నారు. ఈ దేశాల పరిస్థితులను చూసిన తర్వాత భారత్ లోనూ చట్ట సభ సభ్యుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత స్పష్టమవుతోంది. అయిదు దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్ సభ స్థానాలున్నాయి. తమిళనాడు 39, పుదుచ్చేరి ఒకటి, కర్ణాటక 28, ఏపీ 2, తెలంగాణ 17, కేరళలో 20 ఎంపీ స్థానాలున్నాయి. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఉత్తరాదిలో జనాభా నానాటికీ పెరుగుతోంది. జనాభా తగ్గడం వల్ల నియోజకవర్గాలు తగ్గడం, పెరగడం వల్ల నియోజకవర్గాలు పెరగడం జరగుతోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరముంది. జనాభాను నియంత్రిస్తూనే నియోజకవర్గాల పెంంపుపై సమగ్ర కసరత్తు చేపట్టడం నేటి అవసరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News