ఎవరి ప్రయోజనం కోసం?

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం లేవ‌నెత్తిన మూడు రాజ‌ధానుల విష‌యం ఆందోళ‌న‌ల‌ను ర‌గిలిస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో తీవ్ర వ్యతిరేక‌త వ‌స్తోంది. అమ‌రావ‌తి ప్రాంతంలోని 29 గ్రామాల [more]

Update: 2020-01-02 11:00 GMT

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్రభుత్వం లేవ‌నెత్తిన మూడు రాజ‌ధానుల విష‌యం ఆందోళ‌న‌ల‌ను ర‌గిలిస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో తీవ్ర వ్యతిరేక‌త వ‌స్తోంది. అమ‌రావ‌తి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు, రైతులు కూడా రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలు కూడా చేస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌పైనా దుమ్మెత్తిపోస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ నినదిస్తున్నారు. నిజానికి అన్యాయం అంటే ఏంటి? ఎవరికి అన్యాయం? 29 గ్రామాల ప్రజలకా? లేక ఐదు కోట్ల మందికా? అన్న చర్చ జరుగుతోంది.

పిల్లల భవిష్యత్తు నాశనం అంటూ….

ఇక్కడి ప్రజ‌లు రాజ‌ధాని కోసమే తాము రోడ్డెక్కామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఈ ఆందోళ‌న‌ల వెనుక ఉన్న ప్ర ధాన ప్రతిప‌క్షం టీడీపీతో స‌హా ఇత‌ర ప‌క్షాలు.. తాము రైతుల కోస‌మే ఆందోళనకు మ‌ద్దతిచ్చామ‌ని చెబుతున్నారు. రైతుల‌కు అన్యాయం చేస్తే.. స‌హించేది లేద‌ని కూడా హెచ్చరిక‌లు చేస్తున్నారు. దీంతో ఈ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో రెండు విష‌యాలు స్పష్టంగా తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టయింది. ఒక‌టి రైతుల కోసం, రెండు రాజ‌ధాని కోసం అనే వాద‌న బ‌లంగా తెలుస్తోంది. తొలుత ఇక్కడ ప్రజ‌ల వాద‌న‌ను ప‌రిశీలిస్తే.. మేమంతా ప్రభుత్వానికి రాజ‌ధాని కోసం భూములు ఇచ్చాం.. కాబ‌ట్టి ఇక్కడే రాజ‌ధాని ఉండాలి.. లేకపోతే.. మా పిల్లల భ‌విష్యత్తు నాశ‌నం అవుతుంది అంటున్నారు.

తిరిగి ఇచ్చేస్తామంటున్నా…

నిజానికి ఈ వాద‌న‌లో పెద్దగా ప‌స ఉన్నట్టు క‌నిపించ‌డం లేదు. రాజ‌ధాని కోసం ఇక్కడి వారు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే, దీనికి సంబంధించిన ప‌రిహారం కూడా తీసుకున్నారు. అదే స‌మ‌యంలో కౌలు తీసుకుంటున్నారు. పింఛ‌న్లు కూడా పొందుతున్నారు. ఇక‌, ఇక్కడ రాజ‌ధాని ఏర్పాట‌యినా.. వారికి ప్రత్యక్షంగా ఏమీ సంబంధాలు ఉండే అవ‌కాశం లేదు. ఇక‌పోతే.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వ‌ర‌కు వినియోగించిన భూములు ఉంచుకుని, మిగిలిన నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగి ఇచ్చేస్తామ‌ని కూడా చెబుతోంది.

వారి మాటేమిటి?

అమ‌రావ‌తిలో భూములు ఇచ్చిన వారికి వ‌చ్చే న‌ష్టం లేద‌నేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక‌, రైతుల విష‌యాన్ని ప‌రిశీలిద్దాం.. అమ‌రావ‌తిలో త‌మ భూముల‌ను ప్రభుత్వానికి ఇచ్చి తాము ఇబ్బంది కొని తెచ్చుకున్నామ‌ని అంటున్న రైతులకు ప్రతిప‌క్షాలు మ‌ద్దతిస్తున్నాయి. ఎవ‌రైనా రైతుల ప‌క్షపాతిగానే ఉండాల‌ని కోరుకుంటారు. అయితే, రాష్ట్రంలో రైతులు న‌ష్టపోయిన ఘ‌ట‌న కేవ‌లం అమ‌రావ‌తిలోనే జ‌రుగుతోందా ? పోల‌వ‌రం స‌హా అనేక ప్రాజెక్టుల‌కు, జాతీయ ర‌హ‌దారుల‌కు, బ‌హుళ ప్రయోజ‌నాల ప్రాజెక్టుల‌కు త‌మ భూములు, పొలాల‌ను త్యాగం చేసిన రైతులు ఉన్నారు. ద‌ళితులు ఉన్నారు. మ‌రి వారికి ఇప్పటికీ న్యాయం జ‌ర‌గ‌లేదు.

అది తేలేవరకూ….

మ‌రి ఇప్పుడు వీరి ప‌క్షాన ఉద్యమం చేస్తున్న ప్ర‌తిప‌క్షాల‌కు వారు గుర్తుకు రావ‌డం లేదా? అంటే.. రాజ‌ధాని కేంద్రంగా వీటిని మించిన 'విష‌యం' ఏదో నిగూఢంగా ఉంద‌నేది మేధావుల మాట‌. ప్రయోజ‌నాలు వేరే ఉన్నాయ‌నేది వీరి అంచ‌నా సో.. అది తేలే వ‌ర‌కు ఈ అమ‌రావ‌తి ఉద్యమం.. ఉద్యమంగానే ఉంటుంది త‌ప్ప.. విస్తృత ప్రజా ప్రయోజ‌నంగా మాత్రం ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Tags:    

Similar News