Tdp : పట్టాభీ.. ఇదేం పోయేకాలం?

బురద జల్లడం రాజకీయాల్లో మామూలే. అయితే గతంలో ఆధారాలు చూపి మరీ అవినీతి గురించి ఆరోపణలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆధారాలతో సంబంధం [more]

Update: 2021-10-02 00:30 GMT

బురద జల్లడం రాజకీయాల్లో మామూలే. అయితే గతంలో ఆధారాలు చూపి మరీ అవినీతి గురించి ఆరోపణలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆధారాలతో సంబంధం లేదు. బురద జల్లితే చాలు. ఒక్కరు తమ ఆరోపణను నమ్మినా రాజకీయంగా విజయం సాధించినట్లేనన్న అభిప్రాయంలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు అదే రీతిలో ఉన్నాయి.

అధికార ప్రతినిధిగా….

పట్టాభిరామ్ ఇటీవలే టీడీపీ లో ఎదిగిన నాయకుడు. కాస్త మాటాకారితనం ఉండటంతో ఆయనకు అధికార ప్రతినిధి పదవిని టీడీపీ అధినేత కట్టబెట్టారు. ఆ పదవిని చూసుకుని పట్టాభి మరీ రెచ్చిపోతున్నారు. ఏ స్థాయిలేని పట్బాభి జగన్ ను ఏకవచనంతో సంభోధించడమే ఆయన స్థాయి ఏందో చెబుతుంది. ఇక ఎవరిమీదైనా సులువుగా బట్ట కాల్చి వేసే తత్వం ఉన్న పట్టాభిని టీడీపీ కూడా బాగానే ఉపయోగించుకుంటుంది.

డ్రగ్ డాన్ అంటూ….

ఏపీ డ్రగ్ డాన్ జగన్ అట. జగన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారట. జగన్ చేస్తున్న దొంగ వ్యాపారాలు చాలవన్నట్లు మత్తు పదార్థాలు కూడా అమ్ముకుంటావా? అని పట్టాభి మీడియా సమావేశం పెట్టి మరీ ప్రశ్నించారు. గుజరాత్ లో దొరికిన హెరాయిన్ ను వదలకుండా దానిని జగన్ కు ఆపాదించే ప్రయత్నం టీడీపీ నేతలు మానుకోలేదు. అది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ అడ్రస్ మాత్రమే ఉపయోగించుకున్నారని, ఢిల్లీ మాఫియా ఈ హెరాయిన్ ను దిగుమతి చేసుకుందని పోలీసులు చెబుతున్నా ఆగడం లేదు. పట్టాభి ప్రెస్ మీట్లు చూస్తున్నా, వింటున్నా కాస్త పరిజ్ఞానం ఉన్నవారికి ఇరిటేషన్ కలుగుతుంది.

వైట్ ఛాలెంజ్ అట….

ఇక పట్టాభి ఒక అడుగు ముందుకేసి డ్రగ్స్ అక్రమ రవాణాపై వైట్ ఛాలెంజ్ విసిరారు. వైసీీపీ నేతలు వచ్చి డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహాన్నే ఇక్కడ పట్టాభి అమలు చేశారు. అయితే ఎవరూ రాలేదంటూ, తోక ముడిచారంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పట్టాభి స్థాయి నేతకు వార్డు మెంబర్ కూడా స్పందించాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిపై ఏదైనా ఆరోపణ చేసే ముందు కొంత ఆలోచించి చేస్తే మంచిది. లేకుంటే పట్టాభి అభాసుపాలు కాక తప్పదు.

Tags:    

Similar News