Pattabhi : పట్టాభి పక్కకు తప్పుకుంటే ఇక అంతేనా?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాట వినపడటం లేదు. గత రెండు నెలలుగా ఏపీని డ్రగ్స్ ఒక ఊపు ఊపాయి. ప్రధానంగా ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని [more]

Update: 2021-11-05 06:30 GMT

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాట వినపడటం లేదు. గత రెండు నెలలుగా ఏపీని డ్రగ్స్ ఒక ఊపు ఊపాయి. ప్రధానంగా ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డ్రగ్స్ దందా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుందని ఆరోపించింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో దొరికన హెరాయిన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లింక పెట్టింది. దాదాపు రెండు నెలల పాటు ఈ రచ్చ సాగింది. టీడీపీ నేత పట్టాభి దీనిని పీక్ కు తీసుకెళ్లారు. పట్టాభి అరెస్ట్ అవ్వడంతో దీనికి చెక్ పడినట్లే కనపడుతుంది.

డ్రగ్స్ పై ఆరోపణలు….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ కు అడ్డాగా మారిందిని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. పట్టాభి కాకినాడ పోర్టుకు వెళ్లి మరీ పరిశీలించి వచ్చారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. బోస్ డీకే పదంతో మరింత వేడి పెరిగింది. వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగారు. దీనికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసి వచ్చారు కూడా.

అరెస్ట్ అయిన తర్వాత….

ఇక పట్టాభిని ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయి మాల్దీవులకు వెళ్లారు. ఇక పట్టాభి వెళ్లినప్పటి నుంచి డ్రగ్స్ ఆరోపణలకు కూడా టీడీపీ నేతలు చెక్ పెట్టినట్లే కనపడుతుంది. ఏ అంశాన్ని టీడీపీ నేతలు పూర్తిగా పట్టించుకోరు. కొత్త అంశాలు రాగానే పాత విషయాలను పక్కన పెట్టడం టీడీపీకి ఆనవాయితీగా మారింది. పట్టాభి వదిలి పెడితే ఇక ఎవరూ ఆ అంశాన్ని పట్టించుకోరా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇప్పుడు ఆ అంశమేదీ?

ఇన్నాళ్లూ డ్రగ్స్ కు, జగన్ కు ముడిపెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు అండ్ టీం తర్వాత దానిని వదిలేయడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. చంద్రబాబు దీక్ష లోనూ డ్రగ్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో డ్రగ్స్ అంశాన్ని టీడీపీ నేతలు మూలన పడేశారంటున్నారు. తిరిగి పట్టాభి ఎంటర్ అయితేనే డ్రగ్స్ అంశం మళ్లీ తెరపైకి తెస్తారని సొంత పార్టీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. పట్టాభి అరెస్ట్ తోనే డ్రగ్స్ ఆరోపణలకు టీడీపీ తెరదించిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News