Pattabhi : పట్టాభి ఎపిసోడ్ లో బకరాలు వీళ్లేనా?

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహం చెంది, కలత చెందిన ముఖ్యమంత్రి అభిమానులు పట్టరాని ఆవేశంతో ఆయన ఇంటి మీద దాడి [more]

Update: 2021-10-24 02:00 GMT

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహం చెంది, కలత చెందిన ముఖ్యమంత్రి అభిమానులు పట్టరాని ఆవేశంతో ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. నానా హంగామా చేసి తమ భుజాల మీద మోస్తున్న నాయకుడికి అధినాయకుడు వద్ద మెప్పు తీసుకొచ్చేందుకు శక్తి మేర కష్ట పడ్డారు. తమ ఘన కార్యాన్ని నిరూపించుకునేందుకు కట్టు బానిసత్వాన్ని సీసీ కెమెరాల సాక్షిగా నిరూపించుకున్నారు. మొదటి విడతలో ఉడ్ పేట, బావాజీ పేట, క్రీస్తు రాజపురం, గుణదల వంటి బెజవాడ దళిత కాలనీల ఆణిముత్యాలు 11 బయట పడ్డాయి.

అదీ తేడా…..

అదే సమయంలో ముఖ్యమంత్రి ని అనుచితంగా దూషించిన నేపథ్యంలో శ్రీమాన్ కొమ్మారెడ్డి పట్టాభిని నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన దరిమిలా గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు బోశడికే పద ప్రయోగం, అర్ధాలు, ప్రయోగాలు, దాని వల్ల మనసుకు కలిగిన గాయాలు, ఇన్నాళ్లు తెలిసో, తెలియకో మనం అనాయాసంగా పద వినియగం తలచుకుని బాధ పడటం అనవసరం కానీ…, బెజవాడ పోలీసులు, గుంటూరు పోలీసులు తొలి విడతలో లెక్క తేల్చిన బకరాలను ఏమనాలి అన్నది ప్రశ్న. ఈ తొలి జాబితాలో బాధింపబడిన ముఖ్యమంత్రి కులానికి చెందిన ఒక్కరు కూడా ఎందుకు లేరు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని అంతగా అవమానిస్తే ఆయన కులానికి చెందిన వారిలో ఒక్కరికి కూడా కోపం రాలేదా, వచ్చినా వారిలో ఒక్కరు కూడా పోలీసులకు కనిపించలేదా?

ఇదెలా సాధ్యం….?

సరే అలా ఆవేశపడిన వాళ్ళని ఆ పట్టాభి నోటి నుంచి వచ్చిన అశుద్ధపు మాటతో దూషించలేము కానీ, వాళ్ళు చేస్తున్న పని ఏమిటో, దాని పర్యవసానాలు ఏమిటో ఇప్పటికీ గుర్తించకపోవడం విషాదం. ఈ బకరాల మీద నాన్ బెయిలబుల్ కేసులు కదా నమోదైంది అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కినా, వాళ్ల ఖర్మ ఎప్పుడు, ఎలా కాలిపోతుందో ఎవరూ ఉహించలేరు. తొలి విడత జాబితాలో ఎందుకు కొన్ని పేర్లు లేవో, మీడియాలో, సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చినా పోలీసులకు ఎందుకు కనబడలేదో, రాజకీయాల్లో ఎవరి స్థానం ఏమిటో అర్థం చేసుకుంటే ఎప్పుడో బాగుపడేవారు.

Tags:    

Similar News