పవన్ లెక్కలు టాలీ అవుతాయా..?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెబుతున్న జనసేన పార్టీ ఎన్నికల వేళ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. వామపక్షాలు మినహా [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెబుతున్న జనసేన పార్టీ ఎన్నికల వేళ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. వామపక్షాలు మినహా [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెబుతున్న జనసేన పార్టీ ఎన్నికల వేళ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. వామపక్షాలు మినహా ఎవరితోనూ పొత్తు ఉండదని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ వెళ్లి బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కలుపుకొని వచ్చారు. మాయావతిని ప్రధాన మంత్రిగా చూడాలనేది తన కల అని చెప్పారు. అంతా బాగానే ఉన్నా సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల కంటే బీఎస్పీని పవన్ బలమైన పార్టీగా భావిస్తున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల కంటే బీఎస్పీకి ఆయన ఎక్కువ స్థానాలు కేటాయించడం ఆసక్తికరంగా మారింది.
వామపక్షాలకు అధిక ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వామపక్ష పార్టీల ప్రభావం చాలా తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలూ ఒక్కో శాతం ఓట్లను కూడా సాధించుకోలేకపోయాయి. ప్రజా పోరాటాల్లో ముందుండే ఆ పార్టీలు ఎన్నికల విషయానికి వచ్చే సరికి వెనుకబడుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ వంటి క్రేజ్ ఉన్న నేత వెనుక ఉంటే తాము కొంత ఎదగొచ్చని భావించాయి. తనవి కమ్యూనిస్టు భావాలని, చెగువేరాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పే పవన్ కళ్యాణ్ కూడా వారి పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కొంచెం ఎక్కువ. తెలంగాణలో ప్రజాకూటమిలో భాగంగా సీపీఐకి కేవలం 3 స్థానాలు మాత్రమే వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఏకంగా ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను ఆ పార్టీకి కేటాయించారు. సీపీఎం పార్టీకీ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించి సమ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, ఆ రెండు పార్టీలకు గెలిచే స్థాయిలో బలం ఉందా అనేది అనుమానమే.
బీఎస్పీకి అన్ని సీట్లా..?
ఇక, అంతో ఇంతో ప్రజల్లో ఉండే వామపక్షాలకు ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే బహుజన సమాజ్ పార్టీకి ఏకంగా 21 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు కేటాయించడొం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ పార్టీకి ఏపీలో ఏ మాత్రం బలం లేదు. అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి. కేవలం ఎవరైన బలమైన అభ్యర్థులు టిక్కెట్లు ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దొరకకపోతే ఏనుగు గుర్తు ప్రజల్లోకి వెళుతుంది అన్న ఏకైక ఉద్దేశ్యంతో ఆ పార్టీ బీఫాంపై పోటీ చేసి కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకుంటారు. కొందరు స్వంత బలంతో విజయం సాధిస్తారు. అంతేకానీ ఆ పార్టీకి ఏపీలో కానీ, తెలంగాణలో కానీ పెద్దగా బలం లేదు. అయితే, దళితుల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంటుంది. ఈ ఉద్దేశ్యంతోనే దళితుల ఓట్ల కోసం ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారనేది స్పష్టమవుతోంది. అయితే, ఆ పార్టీకి చాలా ఎక్కువ స్థానాలు కేటాయించారని అంటున్నారు. ఇక, పొత్తుల్లో బాగంగా పవన్ కళ్యాణ్ వదులుకుంటున్న సీట్ల విషయమై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంగళగిరిలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. అటువంటి స్థానాన్ని సీపీఐ పార్టీకి వదిలేశారు. వాస్తవానికి, ఇక్కడ సీపీఐ కంటే సీపీఎం బలంగా ఉంది. 1994 ఆ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. 1999లోనూ రెండు స్థానంలో నిలిచింది. మరి ఈ స్థానాన్ని జనసేన, సీపీఎం కంటే బలహీనంగా ఉన్న సీపీఐకు ఎందుకు కేటాయించారో తెలియడం లేదు. అయితే, టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్నందున ఆయన విజయానికి ఇబ్బంది ఉండకుండానే ఈ స్థానాన్ని సీపీఐకు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ లెక్కలు అంతుచిక్కకుండా ఉన్నాయి.