నమ్ముకున్న వారికి నీరసమేనా?
సినీ ప్రపంచంలో తిరుగులేని స్టార్ గా ఎదిగినా రాజకీయాల్లో ఇంత కిందిస్థాయి చూస్తానని అనుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దెబ్బలు తగులుతాయి. రాళ్లు విసురుతారు పూలు [more]
సినీ ప్రపంచంలో తిరుగులేని స్టార్ గా ఎదిగినా రాజకీయాల్లో ఇంత కిందిస్థాయి చూస్తానని అనుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దెబ్బలు తగులుతాయి. రాళ్లు విసురుతారు పూలు [more]
సినీ ప్రపంచంలో తిరుగులేని స్టార్ గా ఎదిగినా రాజకీయాల్లో ఇంత కిందిస్థాయి చూస్తానని అనుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దెబ్బలు తగులుతాయి. రాళ్లు విసురుతారు పూలు జల్లుతారు. అన్నింటిని భరించడానికి వచ్చా అంటూ జనసేన పార్టీ పెడుతూ చెప్పిన పవన్ కళ్యాణ్ నాటి నుంచి ఎదురు దెబ్బలు తింటూనే వున్నారు. తాను నమ్మిన వాళ్ళు ఒక్కొక్కరుగా వీడి వెళ్ళిపోతూ తనను నమ్ముకున్న వారికి నీరసం తెప్పిస్తుండటంతో పవన్ బాగా హర్ట్ అయ్యినట్లు ఆయన తీరు స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జనసేనను వీడటాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
అంతర్గత సమస్యల సుడి లో …
జనసేన పార్టీ ఇప్పుడు అంతర్గత సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఒక భారీ పరాజయం పార్టీలో అందరిని కుంగతీసింది. అయితే అధినేత ఓటమి పై ఇచ్చిన భరోసా భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్న దశలో అయన బిజెపి తో జత కట్టేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల్లో బలం పెంచుకుని పోటీ కి సిద్ధం అవుదామనుకున్న ఆశావహుల ఆశలపై పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆశనిపాతమే అయ్యింది. రాబోయే పొత్తులో తమ సీటు ఉంటుందో ఉండదో గ్యారంటీ లేనప్పుడు ఇప్పటినుంచి పార్టీ కోసం శ్రమించడం వృధా అనే కొందరు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మాత్రం తమ అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఎవరు ఉన్నా, పోయినా నష్టం లేదని లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.
ఒక్కడు చుక్కలు చూపిస్తున్నాడు …
జనసేన ను వేధిస్తున్న మరో సమస్య ఒకే ఒక్కడుగా గెలిచిన రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్. ఆయన పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు జగన్ ప్రభుత్వ ప్రతీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉండటంతో రాపాక పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అలా చర్యలు తీసుకునే పక్షంలో సాంకేతికంగా రాపాక శాసన సభ్యత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. తీసుకోకుండా ఉంటే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళతాయి. దాంతో రాజోలు ఎమ్యెల్యే ని దారిలోకి తేవడం పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల కావడం లేదు. ఆయన తమ పార్టీలో ఉన్నడో లేదో అంటూ జనసేనాని నిర్వేదంతో కూడిన వ్యాఖ్య చేశారంటే రాపాక సొంత పార్టీలో పెట్టిన కుంపటి తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు. ఇలా ఒక పక్క జారిపోతున్న నాయకులు అండగా నిలవని ఏకైక ఎమ్యెల్యే, పార్టీని చుట్టుముడుతున్న ఆర్ధిక సమస్యలు, సినిమాల్లోకి వెళ్ళడం తప్పన్నట్లు విరుచుకుపడుతున్న ప్రత్యర్ధులు, క్షేత్ర స్థాయిలో ఇంకా రూపొందని పార్టీ యంత్రాంగం. ఇలా అడుగుకో సమస్య లు జనసేనకు సవాళ్ళు విసురుతున్నాయి. మరి వీటికి పవన్ కళ్యాణ్ ఎలా జావాబు చెబుతారో చూడాలి.