సీమ లో అంత సీన్ ఉందా?
మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ దాదాపుగా వైఎస్సాఆర్ పార్టీ క్లిన్ స్వీప్ చేసింది. దాంతో తెలుగుదేశం పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరగడమే కాదు అధికారానికి దూరమైంది. ఇక జనసేన [more]
మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ దాదాపుగా వైఎస్సాఆర్ పార్టీ క్లిన్ స్వీప్ చేసింది. దాంతో తెలుగుదేశం పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరగడమే కాదు అధికారానికి దూరమైంది. ఇక జనసేన [more]
మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ దాదాపుగా వైఎస్సాఆర్ పార్టీ క్లిన్ స్వీప్ చేసింది. దాంతో తెలుగుదేశం పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరగడమే కాదు అధికారానికి దూరమైంది. ఇక జనసేన కు సీమ పూర్తిగా గుండు సున్నా చుట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు అక్కడ తమ తమ పార్టీలను పటిష్టం చేసుకునే పనిలో పడ్డాయి. వీటితోపాటు బిజెపి కూడా బూత్ స్థాయి నుంచి సీమలో పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టింది. బలమైన నేతలను పార్టీలో వచ్చినవారిని వచ్చినట్లు చేర్చుకుంటూ తమ వ్యూహంలో సాగిపోతుంది.
సైకిల్ దిగిపోకుండా….
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమ జిల్లాల పర్యటన వెనుక వున్న లక్ష్యం అదే అంటున్నారు. దీనితో పాటు పార్టీలో ఉండేది ఎందరు పోయేది ఎందరు అనే లెక్కల్లో చంద్రబాబు ఒక అంచనా రూపొందించుకుంటున్నారు. సీమలో జగన్ ఓటు బ్యాంక్ కు దెబ్బతగిలితే ఆ ప్రభావం రాష్ట్రం అంతా పడుతుందన్న అంచనా బాబు లక్ష్యంగా కనిపిస్తుంది. దాంతో ఆయన ఎన్నడూ లేని విధంగా కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారితో మమేకం అవుతున్నారు. నేతల వ్యాపారాల రీత్యా అధికారం ఎటు ఉంటే ఆటే ఉంటారని గ్రహించిన పసుపు పార్టీ అధినేత కార్యకర్తల భుజాలపై చేతులు వేసి ఒక్కోచోట పెద్దవారి కాళ్ళు సైతం మొక్కుతూ సైకిల్ దిగిపోకుండా చూసుకునే పనిలో పడ్డారు.
ఇక పవన్ కన్ను అక్కడే …
వాస్తవానికి జనసేన కు సీమలో బలం సున్నా. రాయలసీమ లో బలిజ సామాజికవర్గం అధికంగా వున్నా ఇక్కడ ఒక్క సీటు సేన దక్కించుకోలేక పోయింది. గత ఎన్నికల్లో అత్యంత ఘోర పరాజయం ఎదురైన సీమలో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ తామే అన్న అభిప్రాయం కల్పించుకునేందుకు రైతు సమస్యలపై పర్యటన పేరుతో పవన్ తన రీ జర్నీ మొదలు పెట్టనున్నారు. గత ఎన్నికలకు ముందు సీమలో వెనుక బడిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం నుంచి తాను పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించి సర్వేల్లో జనం నాడి తనకు అనుకూలంగా లేకపోవడంతో భీమవరం, గాజువాక ల నుంచి పోటీ చేశారు.
సీమ ఉద్యమం పేరుతో….
సీమ సమస్యలపై పోరాటం పేరుతో గతం లోను పర్యటనలు చేసినా జనసేనకు ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే భావి రాజకీయానికి పునాదులు పటిష్టం చేసుకునేందుకు పవన్ అడుగులు వేస్తున్నా ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సీమ వాసుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. కర్నూలు లో హై కోర్ట్ ను ఏర్పాటు చేయాలన్న అక్కడి వారి డిమాండ్ పై పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసులకు అటెండ్ అయ్యేందుకే అంటూ ఆయన మాట్లాడటం సీమ వాసుల మనోభావాలు దెబ్బతీసింది. అయితే ఇలాంటి వ్యవహారాలపై సీమకు రైతుల మేలు కోసం అంటూ చేపట్టిన పర్యటన ఆయనకు ఏమేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.