అనుమానం అక్కరలేదు

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడతాయా? లేదా? అన్న అనుమానాలు అందరికీ కలిగాయి. మోడీ తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ లో పరిస్థితులు మరింత [more]

Update: 2019-10-12 17:30 GMT

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడతాయా? లేదా? అన్న అనుమానాలు అందరికీ కలిగాయి. మోడీ తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ లో పరిస్థితులు మరింత దిగజారతాయన్న విశ్లేషణలూ వచ్చాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే కర్ఫ్యూ ఎత్తి వేసి చూడమనండి కాశ్మీర్ లో ఏం జరుగుతుందో? అని ప్రశ్నించారు కూడా. ఇలా దాదాపు రెండు నెలల నుంచి కాశ్మీర్ లో పరిస్థితులు అంచనాలకు అందకుండా ఉన్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో…

జమ్మూ కాశ్మీర్ లో 370 అధికరణ ఎత్తివేయడం, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలతో కాశ్మీర్ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక పాక్ అయితే అంతర్జాతీయ వేదికలపై భారత్ కాశ్మీర్ పై తీసుకున్న చర్యలను ఖండించింది. ఇది ఐక్యరాజ్య సమితి నిబంధలను తుంగలో తొక్కడమేనని వాదించింది. కానీ భారత్ మాత్రం కాశ్మీర్ తమదేనని, భారత్ లో అంతర్భాగమేనని వాదిస్తూ వస్తోంది.

ఒక్కొక్క అడుగుతో….

క్రమంగా కాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. కర్ఫ్యూ ఎత్తివేతతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. కాశ్మీర్ లోయలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇలా కాశ్మీర్ ను అన్ని రకాలుగా ఒక కొలిక్కి తెచ్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు రాజకీయ పార్టీలు సయితం క్రమంగా ఆ షాక్ నుంచి కోలుకుంటున్నాయి.

ఎన్నికలు ఉండటంతో….

ఇప్పటికే కాశ్మీర్ లో రాజకీయ పార్టీల నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గృహనిర్భంధంలో ఉంచింది. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే వారు తమ పార్టీ నేతలను కలసుకునే వెసులుబాటును ఇటీవలే ప్రభుత్వం కల్పించింది. దీనికి తోడు వారిని నిర్భంధం నుంచి విడుదల చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన జమ్మూకాశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో వారిని విడుదల చేయాలని భావించింది. ఎన్నికలు సజావుగా జరిగితే కాశ్మీర్ లో ప్రభుత్వం సగం సక్సెస్ అయినట్లే.

Tags:    

Similar News