టీడీపీ పీలా అక్కడ డీలా ?
ఆయన లక్కీయెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఆయన ప్రాంతం అది కాదు, ఆయనకు రాజకీయంగా కూడా అక్కడ పెద్దగా పట్టులేదు. తండ్రి మహలక్ష్మినాయుడు రాజకీయాల్లో ఉన్నా [more]
;
ఆయన లక్కీయెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఆయన ప్రాంతం అది కాదు, ఆయనకు రాజకీయంగా కూడా అక్కడ పెద్దగా పట్టులేదు. తండ్రి మహలక్ష్మినాయుడు రాజకీయాల్లో ఉన్నా [more]
![టీడీపీ పీలా అక్కడ డీలా ? టీడీపీ పీలా అక్కడ డీలా ?](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2021/09/peela-sathyanarayana-aug-19-1.jpg)
ఆయన లక్కీయెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఆయన ప్రాంతం అది కాదు, ఆయనకు రాజకీయంగా కూడా అక్కడ పెద్దగా పట్టులేదు. తండ్రి మహలక్ష్మినాయుడు రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ ఎమ్మెల్యే అయింది లేదు. అయినా ఆయన వారసుడిగా టీడీపీలో కొనసాగుతూ పీలా గోవింద సత్యనారాయణ 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అయిపోయారు. నిజానికి ఆయనది పెందుర్తి ప్రాంతం. అనకాపల్లికి చాలా దూరంగా ఆయన నివాసం ఉంటుంది. అలా కనుక చూసుకుంటే ఆయన వలస వచ్చిన నేత. అంతే కాదు రాజకీయం కలసి వచ్చిన నేత కూడా. ఇక అయిదేళ్ళ పాటు పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి రాజకీయాల్లో చక్రం తిప్పేశారు. ఆయన తరఫున కుమారుడు కూడా డీఫ్యాక్టో ఎమ్మెల్యేగా ఏకంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
భూ దందాల విషయంలో….
మరో వైపు భూ దందాల విషయంలో కూడా పీలా గోవింద సత్యనారాయణ మీద విమర్శలు రావడం, ప్రజలతో పెద్దగా కలవకపోవడం, అనకాపల్లిలో వర్గ పోరు వంటివన్నీ తోడు అయి ఆయనను 2019 ఎన్నికల్లో ఓడించాయి. పీలా గోవింద సత్యనారాయణ కు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని ఒక దశలో చంద్రబాబు భావించారని చెబుతారు. అయితే పీలా పలుకుబడి ఉపయోగించుకుని టికెట్ సంపాదించుకున్నారు. ఆయన ఓడిపోతారని పార్టీ నేతలే ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. చివరకు అదే నిజం అయ్యింది. ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన నియోజకవర్గంలో పార్టీని అనాథలా వదిలేశారు.
ఇప్పటికీ వ్యతిరేకతే…..
పీలా గోవింద సత్యనారాయణ పై ఇప్పటకీ కూడా టీడీపీ కేడర్లో వ్యతిరేకత ఉన్నా కూడా ఆయన తనకే మళ్లీ టికెట్ అని నమ్ముతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈసారి క్యాండిడేట్ ని మారుస్తారు అంటున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా నాగ జగదీశ్వరరావుకు 2024 ఎన్నికల్లో టికెట్ ఖాయమని చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్ లకు అత్యంత ఆప్తుడుగా ఉన్న బుద్ధాకు ఈ మేరకు గట్టి హామీ లభించింది అంటున్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు వరకు ఆయనే పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే బాబు సూచన మేరకు ఆయన టిక్కెట్ త్యాగం చేయడంతోనే పీలా గోవింద సత్యనారాయణ కు అప్పుడు టిక్కెట్ వచ్చింది.
టిక్కెట్ దక్కకుంటే?
పీలా గోవింద సత్యనారాయణ కన్నా ఆయనే నియోజకవర్గంలో చురుకుగా ఉంటున్నారు. ఒక వేళ పీలా గోవింద సత్యనారాయణ కు కనుక టికెట్ దక్కకపోతే ఆయన రాజకీయ జీవితం వన్ టైమ్ ఎమ్మెల్యేగానే మిగిలిపోతుందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పీలా గోవింద సత్యనారాయణ ను అభ్యర్దిగా పెడితే అవతల వైపు క్యాండిడేట్ సులువుగా గెలుస్తారు అన్న ప్రచారం అయితే ఉంది. దాంతో టీడీపీ కోరి మరీ అనకాపల్లి లాంటి సీటు వదులుకోదు అంటున్నారు.