మనసు కరగదా….? మహిమ జరగాలా?

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఉద్యమం జరుగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ఉద్యమానికి నేటితో 200 రోజులు [more]

Update: 2020-07-04 00:30 GMT

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఉద్యమం జరుగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ఉద్యమానికి నేటితో 200 రోజులు ముగిసింది. దీంతో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల్లో నిరసనలు తెలియజేయాలని నిర్ణయంచాయి. వీరి ఉద్యమానికి నేడు రాజకీయ పార్టీలు కూడా సంఘీభావాన్ని ప్రకటించనున్నాయి.

తమ భూములను ఇచ్చి…..

రాజధాని అమరావతికి అక్కడ 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా అప్పటి ప్రభుత్వానికి 30 వేల ఎకరాలు భూమిని ఇచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశించారు. మూడు పంటలు పండే భూములను సయితం వారు ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు రెండు రకాలుగా విభజించి కేటాయిస్తామని అగ్రిమెంటు కుదుర్చకుంది.

మూడు రాజధానుల ప్రతిపాదనతో…..

అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలు లో న్యాయరాజధాని నిర్మించాలని ఈ ఏడాది జనవరి నెలలో అసెంబ్లీలో జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి రాజధాని ప్రాంత రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఇప్పటి వరకూ రాజధాని తరలింపు జరగలేదు.

నేటికి 200 రోజులు….

ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనవైపే మొగ్గు చూపుతోంది. ఏపీలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంగా ఉన్న అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో రాజధాని రైతులు కోవిడ్ సమయంలోనూ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేటితో రాజధాని రైతుల ఆందోళన ప్రారంభమై 200 రోజులు అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రాజధాని రైతుల ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించనున్నారు.

Tags:    

Similar News