మేలుకోకుంటే ముప్పు తప్పదు
సమీక్ష అవసరం అన్న చర్చ గ్రామాల్లో మొదలయింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపార గౌరవం ఉంది. అందులోని అవినీతి ఆ వ్యవస్థలోని కొద్దిమందికి, నగరాల్లోని కొందరు విద్యావంతులకు మాత్రమే [more]
సమీక్ష అవసరం అన్న చర్చ గ్రామాల్లో మొదలయింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపార గౌరవం ఉంది. అందులోని అవినీతి ఆ వ్యవస్థలోని కొద్దిమందికి, నగరాల్లోని కొందరు విద్యావంతులకు మాత్రమే [more]
సమీక్ష అవసరం అన్న చర్చ గ్రామాల్లో మొదలయింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపార గౌరవం ఉంది. అందులోని అవినీతి ఆ వ్యవస్థలోని కొద్దిమందికి, నగరాల్లోని కొందరు విద్యావంతులకు మాత్రమే ఇప్పటివరకు తెలుసు. ఈ చర్చ ఇంకా ఇలాగే కొనసాగితే, ఎక్కడో ఎప్పుడో ఒకరిద్దరు మాజీ న్యాయమూర్తులో, సీనియర్ న్యాయవాదులో ప్రస్తావించే అంశాలు పట్టణాల్లో, పల్లెల్లో సాధారణ ప్రజలు కూడా మాట్లాడడం మొదలు పెడితే వ్యవస్థ పతనం అవుతుంది. విజ్ఞులు మేలుకొంటే మంచిది.
అతిజోక్యం….
ఏ వ్యవస్థ మరో వ్యవస్థ కార్యకలాపాల్లో, నిర్ణయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం హర్షించదగ్గ పరిణామం కాదు. రంగు నుండి రాజ్యాంగ నిబంధనల వరకూ న్యాయస్థానాలే నిర్ణయం చేయలనుకోవడాన్ని ప్రజలు అంగీకరించరు. ఇలాంటి నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలకు పైచేయిగా అనిపించ వచ్చు. విజయం అని కూడా అనిపించవచ్చు. కానీ అది తాత్కాలికం. ఎందుకంటే అధికారం ఏ ఒక్కపార్టీకో శాశ్వతం కాదు.
విభేదాలను పక్కన పెట్టి…
రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి మూడో సభగా మారుతున్న మూడో వ్యవస్థ తీరు గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ అతిజోక్యాన్ని సమర్ధిస్తే రేపు అది మీ మెడకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇకపై అధికార పార్టీ, అది ఏ పార్టీ అయినా సరే, తీసుకునే ప్రతి నిర్ణయం న్యాయస్థానాల పరిశీలనకు పోతుంది. అప్పుడు నిషేధం విధిస్తూ జీవోలు ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
నీతి – రాజనీతి – న్యాయం – ధర్మం
ఇలా చాలా ఉంటాయి. ఈ వ్యవహారాలు ఇప్పటివరకూ సాధారణ ప్రజలు పట్టించుకోలేదు. ఇపుడే చర్చ మొదలేశారు. ఇక్కడ ఆగితే వ్యవస్థల పరువు, గౌరవం మిగులుతుంది. చర్చ ముందుకు వెళితే ప్రజల్లో అభాసుపాలవక తప్పదు. వ్యవస్థల (చట్ట సభలు, న్యాయస్థానాలు) గౌరవం కాపాడుకోవడం సదరు వ్యవస్థల పెద్దల చేతుల్లోనే ఉంది.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్