హ్యాట్రిక్ కొట్టారు… దేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీయే అక్కడ

ఆగ్నేయాసియా దేశమైన సింగపూర్ కు భారత్ కు ఒకింత పోలిక ఉంది. 1965 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటివరకు అక్కడ ఒకే పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ [more]

Update: 2020-08-01 16:30 GMT

ఆగ్నేయాసియా దేశమైన సింగపూర్ కు భారత్ కు ఒకింత పోలిక ఉంది. 1965 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటివరకు అక్కడ ఒకే పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. 55 సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారాన్ని చెలాయిస్తోంది. భారత్ లో కుాడా 1947 నుంచి 1977 వరకు ముాడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. మళ్ళి 1980 నుంచి 1996 వరకు, 2004 నుంచి 2014 వరకు హస్తం పార్టి హవా కొనపాగింది. ఈ విధంగా రెండు దేశాల మధ్య, రెండు దేశాల్లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఒకింత సారూప్యత ఉంది.

మూడోసారి ప్రధానిగా…..

తాజాగా గత నెల 10న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని లీ సిమోన్ లూంగ్ (68) నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం సాధించింది. మెుత్తం 93 స్ధానాలకు గాను ఈ పార్టీ 83 స్ధానాలను, 61.24 శాతం ఓట్లను సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికతో లుాంగ్ ముాడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. సింగపూర్ ఆవిర్భావం నుంచి పీపుల్స్ యాక్షన్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుండటం విశేషం. తాజా ఎన్నికల్లో విపక్ష వర్కర్స్ పార్టీ 10 స్ధానాలకే పరిమితమైంది. అయితే 2015 లో కేవలం 6 స్ధానాలను గెలుచుకున్న వర్కర్స్ పార్టీ ఇప్పుడు 10 స్ధానాలను గెలుచుకోవడం ఒకింత ఊరట కలిగించే అంశం. అదే సమయంలో అధికార పార్టీ అయిన పీపుల్స్ యాక్షన్ పార్టీ కి 2015 కన్నా నాలుగు స్ధానాలు తగ్గడం గమనార్హం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లుంగ్ కుటుంబమే అధికారంలో కొనసాగుతుండటం గమనార్హం. భారత్ లో కుాడా సుదీర్ఘకాలం హస్తం పార్టీ కేంద్రంలో చక్రం తిప్పడం తెలిసిందే. విపక్ష వర్కర్స్ పార్టీ అధినేత ప్రీతకుసింగ్ (43) భారత్ సంతతికి చెందిన వారు కావడం విశేషం.

కరోనా సమయంలోనూ….

కోవిడ్ కష్ట కాలంలోనూ ఎన్నికల నిర్వహణకే సింగపూర్ మెుగ్గుచాపింది. కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య దాదాపు 57 లక్షల ఓటర్ల తమ ఓటుహక్కు వినియెాగించుకున్నారు మాస్క్ లు ధరించడం, భౌతిక దుారం పాటించడం, విస్తృతంగా శానిటైజర్లవాడకం వంటి జాగ్రత్తలు ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ సమర్ధంగా నిర్వహించింది. సింగపూర్ రాజ్యాంగం ప్రకారం 21 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడుా ఓటుహక్కు కలిగి ఉంటాడు. దేశ రాజ్యాంగం ప్రకారం ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నికైన అధ్యక్షుడే కీలకం. ఆయన చేతిలోనే సర్వాధికారాలు కేంద్రీకృతం అయి ఉంటాయి. ప్రధానిని అధ్యక్షుడు నియమిస్తారు. ఆయన నామమాత్ర అధికారాలను కలిగి ఉంటాడు. దేశంలో ఆంగ్లం, మలయాళం, చైనీస్, తమిళం అధికార భాషలు. 33.2 శాతం మంది బౌద్ధులు, 18.8 శాతం క్త్రెస్తవులు, 5 శాతం హిందువులు, ఇతర మతాలవారు ఉన్నారు. సింగపూర్ ద్వీప దేశం. దేశంలో ఇంకా చిన్నచితకా ద్వీపాలు దాదాపు 60కి పైగా ఉన్నాయి. పెద్ద ద్వీపమైన సింగపూర్ దేశ వ్యవహరాల్లో కీలకపాత్ర, ఆగ్నేయాసియా దేశమైన సింగపూర్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కుాటమిలో కీలక భాగస్వామి.

ఆర్థిక మాంద్యంతో…..

అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నప్పటికీ అంతా సజావుగా ఉందని చెప్పలేం. 2015 లో పోలిస్తే పార్టీకి ఓట్లు, సీట్లు తగ్గడం ప్రమాద ఘంటికను మెాగిస్తోంది. గతఎన్నికల్లో 89 స్ధానాలు రాగా, ఈ దఫా 83 స్ధానాలకే పరిమితం కావడం గమనార్హం. అదే సమయంలో ఓట్లశాతం కుాడా 69.9 నుంచి తాజాగా 61.24 శాతానికి తగ్గడం తగ్గుతున్న ప్రజాదరణకు సంకేతంగా పేర్కొనవచ్చు. సంపన్న దేశంగా పరిగణించే సింగపుార్ ఆర్ధిక పరిస్ధితి కరోనా కారణంగా తలకిందులైంది. దేశానికి పర్వాటక రంగం ప్రధాన ఆదాయ వనరు. కరోనా కారణంగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై పడింది. ఆర్ధిక వృద్ధి 7 నుంచి 4 శాతానికి మందగించింది. పరిస్ధితిని అధిగమిస్తామని, దేశానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకువస్తానని ప్రధాని లుాంగ్ గంభీరంగా చెబుతున్నప్పటికీ అది అంత తేలిక కాదన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటులో ఎండగడతామని, ప్రతిపక్షనాయకుడు ప్రీతికు సింగ్ స్పష్టం చేశారు. అదేసమయంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కుాడా ఆయన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో మున్ముందు పరిస్ధితి ఎలా ఉంటుందో వేచిచాడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News