ఫోన్ ట్యాపింగ్ ను రీసెట్ చేయాల్సిందేనా…?

“మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి” విపక్షం అధికారపక్షంపై జాతీయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రొటీన్ గా చేసే ఆరోపణలే అన్నది గతం నుంచి వినిపిస్తున్నదే. అయితే [more]

Update: 2020-08-18 06:30 GMT

“మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి” విపక్షం అధికారపక్షంపై జాతీయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రొటీన్ గా చేసే ఆరోపణలే అన్నది గతం నుంచి వినిపిస్తున్నదే. అయితే అధికారంలో ఉన్నవారు ఎవరైనా ట్యాపింగ్ అంటే ఏమిటి ? దీనిపై ఆధారాలు సమర్పించండి అనడం కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ వివాదం మరోసారి ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయంగా మారింది. రోజుకో రకంగా పుటకోవిధంగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేగడమే కాదు హై కోర్టు వరకు పోయింది.

ఓటుకు నోటు కేసులో ఇదే హడావిడి .. ?

హైదరాబాద్ లో ఒక ఎమ్యెల్సీ ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నాటి ఆ పార్టీ నాయకుడు నేటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సాక్షిగా ఓటుకు నోటు కేసు లో డబ్బు ఇస్తూ అడ్డంగా వీడియో లో దొరికిపోయారు. నాడు స్టీఫెన్సన్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారన్నది ఆరోపణ. దీనిపై ఫోన్ లో మాట్లాడిన వాయిస్ తనదో కాదో నేటికీ చంద్రబాబు స్పష్టం చేయకపోవడం గమనార్హం. దీనిపై టిడిపి ఎదురుదాడి మొదలు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఓటు కు నోటు కేసు వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి ప్రజలను తెలివిగా డైవర్ట్ చేయాలని తెలుగుదేశం గట్టిగానే తన మీడియా ద్వారా ప్రచారం సాగించింది. మొత్తానికి నానాగోల అయ్యాకా ఈ వ్యవహారం రహస్యంగా కేంద్ర పెద్దల జ్యోక్యంతో ఎపి తెలంగాణ ముఖ్యమంత్రుల నడుమ సయోధ్య కుదిరి సద్దుమణిగింది.

ఇప్పుడు మరో సారి …

ఓటుకు నోటు కేసులో భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని ఔపాసన పట్టిన చంద్రన్న టీం ఇప్పుడు మరోసారి ట్యాపింగ్ లు అంటూ గగ్గోలు మొదలు పెట్టింది. వాస్తవానికి ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కేంద్రం అనుమతి లేకుండా చంద్రబాబుకు చేదోడుగా గతంలో ఉన్న ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావు కొనుగోలు చేశారన్నది రచ్చ జరిగింది. ఈ ఆరోపణలపైనే ఆయనకు పోస్టింగ్ సైతం జగన్ సర్కార్ ఇవ్వకుండా ఏడిపించిన సంగతి తెలిసిందే. ఆ పరికరాలు ఇప్పుడు జగన్ సర్కార్ సమర్ధంగా విపక్షంపై వాడేస్తుందా అనే అనుమానం వచ్చే ట్యాపింగ్ గొడవను టిడిపి మొదలు పెట్టిందా లేదా మరేదైనా అన్నది తేలాలిసిఉంది. ఎవరి ఫోన్ ను ఎవరు ట్యాప్ చేశారన్నదానికి ఎలాంటి ఆధారాలు విపక్షం నుంచి లేకపోయినా అమరావతి ఉద్యమాన్ని సాగించలేక విషయాన్నీ మరోసారి డైవర్ట్ చేసే పనిలో పడింది పసుపు దళం. ఇది కూడా కొంత కాలం గోల పూర్తి అయ్యాకా టీ కప్ లో తుఫాన్ గానే మిగిలిపోయేలావుందంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News