పేరులోనే సక్సెస్ ఉందిగా.. అందుకే “విజయ”న్?

కరోనా నుంచి కేరళ రాష్ట్రం దాదాపు బయటపడినట్లే. ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, వేగంగా పరీక్షల మూలంగానే కరోనా వ్యాప్తి త్వరగా కేరళను వీడిందనే చెప్పాలి. భారత్ [more]

Update: 2020-05-14 17:30 GMT

కరోనా నుంచి కేరళ రాష్ట్రం దాదాపు బయటపడినట్లే. ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, వేగంగా పరీక్షల మూలంగానే కరోనా వ్యాప్తి త్వరగా కేరళను వీడిందనే చెప్పాలి. భారత్ కరోనా తొలి కేసు నమోదయింది. చైనా నుంచి వచ్చిన ఒక విద్యార్థినికి వైరస్ సోకడంతో తొలిసారి ఇక్కడ పరీక్షలు నిర్వహించారు. దాదాపు రెండు నెలల నిరంతర శ్రమ కారణంగా పినరయి విజయన్ కరోనా నుంచి కేరళను బయటపడేటంలో సూపర్ సక్సెస్ అయ్యారు.

తొలి వైరస్ కేసు….

కేరళలో తొలుత కరోనా వైరస్ సోకడంతో పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. మార్చి 24 నుంచి ప్రారంభమయిన లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. కేరళలోని అనేక జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ క్వారంటయిన్ కేంద్రాలను, ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి కరోనా వైరస్ సోకిన వారిని తరలించారు. కేరళకే విదేశాల నుంచి ఎక్కువమంది రావడంతో తొలుత వారిని ట్రేస్ చేసి టెస్ట్ చేసి క్వారంటయిన్ కు పంపగలిగారు.

ఆటుపోట్లను తట్టుకుని….

తర్వాత మర్కజ్ మసీద్ ప్రార్థనల ఎఫెక్ట్ కూడా కేరళపై పడింది. దీని నుంచి కూడా పినరయి విజయన్ సులువుగా తప్పించగలిగారు. తొలినుంచి పినరయి విజయన్ కరోనా కట్టడిలో ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలతో సమావేశమవుతూ వారి సూచనలను కూడా గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకెళ్లగలిగారు. రాష్ట్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఇరవై వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి పేద, మధ్యతరగతి ప్రజలకు పినరయి విజయన్ అండగా నిలిచారు.

ఆదివారం షట్ డౌన్….

ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు కేరళలో లేవు. ఉన్న కొద్దిమంది చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల నుంచి కేరళలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో లేదు. దీంతో పినరయి విజయన్ ప్రతి ఆదివారం లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించారు. ఇది రాష్ట్ర భవిష్యత్ కు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఆదివారం ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పినరయి విజయన్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఎం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News