జగన్ ను ఖచ్చితంగా ముంచేది అదేనా?

పోల‌వ‌రం.. ఈ మాట చెబితే చాలు.. ఎక్కడ‌లేని రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. దీనిని రాజ‌కీయంగా వాడుకోని పార్టీ అంటూ ఏదీ లేదు. గ‌తంలో వైఎస్ హ‌యాం నుంచి నేటి [more]

Update: 2020-10-29 12:30 GMT

పోల‌వ‌రం.. ఈ మాట చెబితే చాలు.. ఎక్కడ‌లేని రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. దీనిని రాజ‌కీయంగా వాడుకోని పార్టీ అంటూ ఏదీ లేదు. గ‌తంలో వైఎస్ హ‌యాం నుంచి నేటి జ‌గ‌న్ వ‌ర‌కు మ‌ధ్యలో చంద్రబాబు దాకా.. అందరూ పోల‌వరాన్ని వాడుకుని వ‌దిలేశారు. ఇంకాస్త ముందుకు వెళితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించ‌క‌ముందే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న టి. అంజ‌య్య పోల‌వ‌రం ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు. ఆ త‌ర్వాత టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఎన్టీఆర్ సైతం పోల‌వ‌రం క‌ట్టాల‌ని ఎన్నో ప్రయ‌త్నాలు చేయ‌డంతో పాటు అంచ‌నాలు కూడా వేయించారు. అప్పటి నుంచి పోల‌వ‌రం వార్తల్లో మాత్రమే ఉంటోంది.. ప్రాజెక్టు మాత్రం క‌ల‌గానే మిగులుతోంది. గ‌‌త ఎన్నిక‌ల‌కు ముందు పోల‌వ‌రం ప్రాజెక్టు ఎన్నిక‌ల స‌బ్జెక్టుగా మారిపోయింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2018 నాటికి నీళ్లు పారిస్తామ‌ని.. అప్పటి మంత్రి దేవినేని ఉమా ప్రక‌టించ‌ని రోజంటూ ఏమీలేదు. ఇక‌, చంద్రబాబు ప్రతి సోమ‌వారాన్ని పోల‌వారం చేసుకుని ముందుకు సాగారు.

రాజకీయంగా వాడుకుని….

ఎక్కడిక‌క్కడ పోల‌వ‌రం ప్రాజెక్టును రాజ‌కీయంగా వాడుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో చిన్న త‌ట్టెడు మ‌ట్టి వేసినా చంద్రబాబు చేసుకున్న ప‌బ్లిసిటీ మామూలుగా లేదు. ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఆ పార్టీ కూడా వ‌చ్చే ఏడాది నాటికి.. దీనిని పూర్తి చేసి తీరుతామ‌ని చెప్పింది. కానీ, క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి గ‌మ‌నించినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి వ‌స్తున్న సూచ‌న‌లు గ‌మ‌నిస్తున్నా.. ఈ ప్రాజెక్టు ప‌రిస్థితి ఇప్పట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేద‌న్నది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ఈ ప్రాజెక్టు విష‌యంలో చంద్రబాబును కేంద్రంలోని బీజేపీ పెద్దలు ముప్పుతిప్పలు పెట్టారు. వారిని ఒప్పించి.. నిధులు తెప్పించుకునే స‌రికి బాబుకు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది.

నిధుల్లో కోత…..

చంద్రబాబుకు సైతం పోల‌వ‌రం పూర్తవుతుంద‌న్న న‌మ్మకం లేక‌నే ఆఘ‌మేఘాల మీద ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల‌తో కృష్ణా – గోదావ‌రి అనుసంధానం చేసి కృష్ణా డెల్టాకు నీరు వ‌దిలేలా చేశారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా పోల‌వ‌రం విష‌యంలో బాబు క‌ష్టాలు కాదు… అంత‌కు మించిన ప‌రిస్థితి ఎదురైంది. ఎందుకంటే.. నిధుల్లో భారీ కోత‌ప‌డిపోయింది. దాదాపు రు. 55 వేల కోట్ల పైచిలుకు ఖ‌ర్చులో ఇప్పటికే ప‌దివేల కోట్ల కు పైగా కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగాదీనిని రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యానికి అంగీక‌రించిన రు. 23 వేల కోట్లకు అంగీక‌రించింది అంటే… ఈ నిధుల‌తోనే పోల‌వ‌రం పూర్తి చేయాల‌నేది కేంద్రం సూచ‌న.

అనుకున్న సమయానికి…..

కానీ, ఇది సాధ్యమేనా? ఇప్పుడున్న ఖ‌ర్చులు, పెరిగిన ధ‌ర‌లు, కూలీలు వంటివాటిని లెక్కించుకుంటే.. ఈ ఖ‌ర్చులో దీనిని పూర్తి చేయ‌డం అనేది అయ్యేది కాదు. పైగా ప్రతి ఏడాది క‌నీసం 5 – 10 శాతం మ‌ధ్యలో అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ లెక్కన పోల‌వ‌రం ప్రాజెక్టు ఆల‌స్యం అవుతోన్న కొద్ది ఏడాదికేడాదికి వ్యయం కూడా పెరుగుతోంది. ఈ లెక్కన చూస్తే జ‌గ‌న్ చెబుతున్నట్టు వ‌చ్చే ఏడాది నాటికి పోల‌వ‌రంలో నీటిని పారించ‌డ‌మూ సాధ్యం కాదు. సో.. మొత్తానికి అప్పట్లో టీడీపీని, ఇప్పుడు వైసీపీని కూడా పోల‌వ‌రం ముంచేస్తోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News