పన్నీర్ కు పోయేదేమీ లేదట

అన్నాడీఎంకే లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. స్వయంగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి ప్రకటించడంతో కథ సుఖాంతమయింది. అయితే ఇది తాత్కాలిమేనంటున్నారు. అసలు [more]

Update: 2020-10-13 16:30 GMT

అన్నాడీఎంకే లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. స్వయంగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి ప్రకటించడంతో కథ సుఖాంతమయింది. అయితే ఇది తాత్కాలిమేనంటున్నారు. అసలు సమస్య ముందుంది అని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థి తమకే కావాలని పట్టుబట్టారు కూడా. తమ అనుచరుల చేత నినాదాలు కూడా చేయించారు.

ఊహించని విధంగా…..

అయితే ఊహించని విధంగా పన్నీర్ సెల్వం పళనిస్వామి పేరును ప్రతిపాదించడాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా చూడాలంటున్నారు. ఇప్పటికీ ఇంకా అన్నాడీఎంకే చీఫ్ పదవిని ప్రకటించలేదు. అది ఖచ్చితంగా పన్నీర్ సెల్వం అవుతారు. అన్నాడీఎంకే చీఫ్ గా ఉండేందుకే పన్నీర్ సెల్వం ఇష్టపడటంతో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. ఎటూ అధికారంలోకి వస్తే తాను తిరిగి ఉప ముఖ్యమంత్రి అవ్వొచ్చు.

పార్టీ చీఫ్ అయితే…..

కానీ పార్టీ పగ్గాలు చేతిలో ఉంటే ప్రభుత్వాన్ని కూడా శాసించవచ్చన్నది పన్నీర్ సెల్వం యోచనగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం అన్నాడీఎంకే 11 మందితో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ స్టీరింగ్ కమిటీకి కన్వీనర్ గానే పన్నీర్ సెల్వం వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ అగ్రనేతలు కావడంతో చెరొక పదవిని తీసుకోవడం రివాజు. అందుకే ఇప్పుడు పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే చీఫ్ కాబోతున్నారు.

చిన్నమ్మను నిలువరించడానికి…..

అన్నాడీఎంకే చీఫ్ గా ఉంటే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో కూడా కీలక భూమిక పోషించే అవకాశముంది. శశికళ జైలు నుంచి బయటకు రాగానే పార్టీ పదవి కోసమే ఆమె ప్రయత్నించే అవకాశముంది. అన్నాడీఎంకేను శశికళ చేతిలో పెట్టకూడదని భావించిన పన్నీర్ సెల్వం తనకు రాజకీయ జన్మనిచ్చిన అన్నాడీఎంకేకు చీఫ్ గానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య కుర్చీ వివాదం సద్దుమణిగినా భవిష్యత్ లో తలెత్తవన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు.

Tags:    

Similar News