మారుతున్న పంజాబ్ రాజకీయం
ఉత్తరాది రాష్ర్టమైన పంజాబ్ రాజకీయాలు మారుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ రాష్ర్ట రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత వస్తోంది. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తేలిపోతోంది. వచ్చే ఏడాది [more]
ఉత్తరాది రాష్ర్టమైన పంజాబ్ రాజకీయాలు మారుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ రాష్ర్ట రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత వస్తోంది. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తేలిపోతోంది. వచ్చే ఏడాది [more]
ఉత్తరాది రాష్ర్టమైన పంజాబ్ రాజకీయాలు మారుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ రాష్ర్ట రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత వస్తోంది. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తేలిపోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ప్రాంతీయ పార్టీ అకాలీదళ్, కేంద్రంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ, దేశంలో పెద్ద రాష్ర్టమైన యూపీని గతంలో పాలించిన మయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల్లో తమ అదష్టాన్ని పరీక్షించేందుకు వ్యూహరచనలో తలమునకలయ్యాయి.
ఈ రెండు పార్టీలు….
రెండు ప్రధాన పార్టీలైన అకాలీదళ్, బీఎస్పీ కలసి పోటీ చేయాలని నిర్ణయించడం తాజా పరిణామం. రెండు దశాబ్దాల పాటు కమలం పార్టీతో కలసి పని చేసిన అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దానితో విభేదించి ఆ పార్టీకి దూరమైంది. దీంతో బీఎస్పీ పేరుతో కొత్త మిత్రుడిని వెతుక్కుంది. సహజంగానే ఆప్, కాంగ్రెస్, బీజేపీలతో పొసగని నేపథ్యంలో మిగిలిన ఏకైకపార్టీ బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైంది. రెండు పార్టీల మధ్య పొత్తు ను అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్, బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా చండీగఢ్లో అధికారికంగా ప్రకటించారు. ఒప్పందం మేరకు మొత్తం 117 సీట్లకు అకాలీలు 90, బీఎస్పీ మిగలిన 27 సీట్లలో పోటీ చేస్తాయి.
పాత మిత్రులే….
నిజానికి అకాలీలకు బీఎస్పీ పాత మిత్రుడే. 1996 పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలు సాధించాయి. మొత్తం 13 పార్లమెంటు సీట్లకు బీఎస్పీ పోటీ చేసిన మూడు చోట్లా విజయ దుందుభి మోగించింది. పది సీట్లలో పోటీచేసిన అకాలీదళ్ 8 సీట్లను కైవసం చేసుకుంది. కాలక్రమంలో అకాలీలు కమలానికి చేరువ అవడంతో సహజంగానే
బీఎస్పీ దూరమైంది. జాబ్ లో దాదాపు 32 శాతం దళిత జనాభా ఉంది. మరో 32 శాతం ఓబీసీలు. హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు మిగిలిన జనాభా. సంపన్న జాట్ సిక్కులు అకాలీలకు దన్నుగా నిలుస్తుంటారు. పల్లెల్లో ఈ పార్టీకి మంచి పట్టుంది. వీరికి తోడు బీఎస్పీ ద్వారా దళిత ఓటుబ్యాంకు జత చేరితే అధికారాన్ని అందుకోవచ్చన్నది అకాలీల అంచనా. బీఎస్పీకి రాష్ర్టంలోని మాల్వా, మాజా, దోవబా ప్రాంతాల్లో ప్రాబల్యం ఉంది. ఇక్కడ దళిత జనాభా ఎక్కువ. మాల్వా నుంచి ఏడు, మాజా ప్రాంతం నుంచి అయిదు, దోవుబా ప్రాంతం నుంచి ఎనిమిది…. మొత్తం పాతిక సీట్లలో పోటీ చేయాలని బీఎస్పీ ప్రాథమికంగా నిర్ణయించింది.
మరోసారి గెలవాలని…..
అయిదేళ్ల క్రితం 2017 ఎన్నికల్లో మొత్తం 117 సీట్లకు పాటియాలా మాజీ మహారాజు కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలో హస్తం పార్టీ 77 సీట్లను సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అనూహ్యంగా ఆప్ పార్టీ 20 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కలసి పోటీచేసిన అకాలీదళ్ 15, కమలం పార్టీ మూడు సీట్లతో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. లోక్ జనశక్తి పార్టీ రెండు సీట్లు సాధించగా, బీఎస్పీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ హస్తం పార్టీ హవా కనబరిచింది. మొత్తం 13 సీట్లకు గాను ఆ పార్టీ 8, అకాలీదళ్2, కమలం పార్టీ 2, ఆప్ పార్టీ ఒక్క సీటు సాధించాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురవేయాలని కెప్టెన్ అమరీందర్ తహతహలాడుతున్నారు.
అంతర్గత విభేదాలు….
ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ను సలహాదారుగా నియమించుకున్నారు. రూపాయి జీతంతో ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. కాంగ్రెస్ లోనూ లుకలుకలు లేకపోలేదు. మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూ పార్టీలో అమరీందర్ కు పోటీదారుగా మారారు. హైకమాండ్ ఆయనకు డెప్యూటీ సీఎం, లేదా పీసీసీ చీఫ్ పదవుల్లో ఏదో ఒకటి కట్టబెట్టాలని కోరుతోంది.ఇందుకు సీఎం ససేమిరా అంటున్నారు. ఇటీవల మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలోని త్రిసభ్య కమిటీ పంజాబ్ వెళ్లి హైకమాండ్ కు నివేదిక సమర్పించింది. అంతర్గత కలహాలు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచే ప్రమాదం లేకపోలేదు.
-ఎడిటోరియల్ డెస్క్