Tdp : చౌదరి గారిని తప్పించేస్తారటగా?

అనంతపురం జిల్లాలో కొత్త ఈక్వేషన్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కమ్మ సామాజికవర్గం నుంచి ఒక నేతను తప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అనంతపురం [more]

Update: 2021-11-07 05:00 GMT

అనంతపురం జిల్లాలో కొత్త ఈక్వేషన్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కమ్మ సామాజికవర్గం నుంచి ఒక నేతను తప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఉన్న ప్రభాకర్ చౌదరి స్థానంలో కొత్త నేత వస్తారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్. అనంతపురం జిల్లాలో పట్టు సంపాదించాలన్న ప్రయత్నంలో పాత వారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.

రెండు దశాబ్దాల తర్వాత….

అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2014లో టీడీపీకి విజయం లభించింది. అదీ ప్రభాకర్ చౌదరి రూపంలో. కొన్నేళ్లుగా ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలలో ఉన్న కారణంగా ఈ విజయం సాధ్యమయింది. 2019 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటికీ తనదే టిక్కెట్ అన్న ధీమాలో ప్రభాకర్ చౌదరి ఉన్నారు.

ఆరింటిలో కమ్మ నేతలే….

అయితే ఇప్పటికే అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, బాలకృష్ణ కమ్మ సామాజికవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ధర్మవరం, కల్యాణదుర్గం కూడా కమ్మ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పదినియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో మొన్నటి వరకూ కమ్మ సామాజికవర్గం నేతలే ఉన్నారు. ఇక్కడ రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది కమ్మలకు టిక్కెట్లు ఇచ్చారన్న వాదనను తోసిపుచ్చేందుకు ఈసారి ప్రభాకర్ చౌదరిని తప్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఆయన స్థానంలో కాపు సామాజికవర్గం నేతకు ఇవ్వాలన్నది కూడా మరో ఆలోచన.

అందుకే ఆయనను తప్పించి….

ఇక జనసేనతో పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని ఆ పార్టీ అడిగే అవకాశముంది. పైగా ప్రభాకర్ చౌదరికి, జేసీ బ్రదర్స్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దీంతో ప్రభాకర్ చౌదరిని తప్పించడమే మంచిదన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లుంది. అందుకే త్వరలోనే అనంతపురం టౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చంద్రబాబు అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు.

Tags:    

Similar News