ఆర్కే కు భయపడి పీకేను?
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు సమీపించే కొద్దీ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తొలిసారి జరుగుతున్న [more]
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు సమీపించే కొద్దీ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తొలిసారి జరుగుతున్న [more]
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు సమీపించే కొద్దీ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2021 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశాయి. ప్రధానంగా డీఎంకే అధినేత స్టాలిన్ ఒకడుగు ముందుకు వేశారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు.
వచ్చే ఏడాది…..
తమిళనాడులో జరగబోయే ఎన్నికలు సంచలనం సృష్టించే అవకాశాలున్నాయి. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకేలు నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీతో ప్రజలకు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ చెప్పారు. రజనీకాంత్, కమల్ హాసన్ లు కలసి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రజనీ రాకతో….
దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు అడియాసలవుతాయా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే రజనీ, కమల్ కు ఉన్న క్రేజ్ తన పార్టీ విజయావకాశాలు దెబ్బతిస్తుందేమోనన్న ఆందోళన లేకపోలేదు. అందుకే స్టాలిన్ కూటమిలోని పార్టీలు తన నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీల ప్రభావం తమిళనాడులో తక్కువే. ప్రాంతీయ పార్టీలదే హవా. రజనీకాంత్ర ప్రభావం ఎక్కువగా ఉందని తెలియడంతో స్టాలిన్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు.
పీకే వ్యూహంతో రజనీకి…..
ప్రశాంత్ కిషోర్ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా మారారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తరుపున ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించి అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. దీంతో అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నాయి. రజనీకాంత్ హవాకు చెక్ పెట్టడానికే పీకేను రంగంలోకి డీఎంకే అధినేత స్టాలిన్ దించారన్నది వాస్తవం. రజనీకాంత్ హవాకు భయపడే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.